రోజాగారు అతిధిగా న‌దీయాస్ ఎంట‌ర్ టైన్మెంట్ ప్రొడ‌క్ష‌న్ నెం 1 పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం

453

న‌దీయాస్ ఎంట‌ర్ టైన్మెంట్ ప‌తాకం పై ఏ ఎమ్ ఫెరోజ్ నిర్మాత‌గా, శంభో శంక‌ర్ ఫేమ్ శ్రీధ‌ర్ ఎన్ డైరెక్ట్ చేస్తున్న ప్రొడ‌క్ష‌న్ నెం 1 పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన ఈ కార్యక్ర‌మానికి ఆంధ్ర‌ప‌ద్రేశ్ శాస‌న‌స‌భ్యురాలు, ఏపిఐఐసి ఛైర్మెన్, ప్ర‌ముఖ తార శ్రీమతి రోజ సెల్వమ‌ణి ముఖ్య అతిధిగా విచ్చేసి, చిత్ర యూనిట్ కి శుభాబినంద‌న‌లు తెలిపారు. ఓ క్రేజీ హీరో, హీరోయిన్ కాంబినేష‌న్ లో ఈ సినిమా అతి త్వ‌రలోనే సెట్స్ మీద‌కి వెళ్ల‌నుంది. ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ గ‌తంలో ప్ర‌ముఖ క‌మీడియ‌న్ ష‌క‌ల‌క శంక‌ర్ తో ఫుల్ క‌మ‌ర్షీయ‌ల్ సినిమా శంభో శంక‌ర తో కమర్షియల్ హిట్ కొట్టి, అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల మెప్పు అందుకున్నారు . ఇప్పుడు చేస్తున్న క‌థ‌ను సైతం వినూత్నంగా ప్ర‌జెంట్ చేయనున్నారు, ఆయ‌న మా న‌దీయాస్ ఎంట‌ర్ టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ తొలి సినిమాతోనే మా బ్యాన‌ర్ కి స‌క్సెస్ అందిస్తార‌నే కాన్ఫీడెన్స్ ఉంది, ఎంతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ మా ప్రొడ‌క్ష‌న్ నెం 1 సినిమా ఓపెనింగ్ కి విచ్చేసి మా అంద‌రికీ త‌న శుభాశ్సిసులు అందిచిన‌, ఏపిఐఐసి ఛైర్మ‌న్, శాస‌న‌స‌భ్యులు శ్రీమ‌తి రోజాసెల్వ‌మ‌ణిగారికి మా యూనిట్ త‌రుపున ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలుపుకుంటున్నాను అన్నారు నిర్మాత ఏ ఎమ్ ఫెరోజ్. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివరాలో త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

సాంకేతిక వ‌ర్గం

బ్యాన‌ర్ – న‌దీయాస్ ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత – ఏ ఎమ్ ఫెరోజ్
ద‌ర్శ‌కుడు – శ్రీధ‌న్ ఎన్
మ్యూజిక్ – మ‌ణిశ‌ర్మ‌
సినిమాటోగ్ర‌ఫి – శ్రీసాయి
ఎడిటిర్ – ఛోటా కే ప్ర‌సాద్
డైలాగ్స్ – హ‌ర్ష వ‌ర్ద‌న్
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్