ఏనుగంటి ఫిలిం జోన్ బ్యానర్ పై దర్శక-నిర్మాత లక్ష్మణ్ చిన్నా ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం నచ్చినవాడు ఈనెల అనగా సెప్టెంబర్ 22న రెండు తెలుగు రాష్ట్రాల్లో పాటు కర్ణాటకలో విడుదలవుతున్న సందర్భంగా, దర్శకుడు లక్ష్మణ్ చిన్నా విలేకరులతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు…
ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ… ఈ నచ్చినవాడు చిత్రం అందరికీ నచ్చే విధంగా ఉన్నత నిర్మాణ విలువలతో, స్త్రీ ఆత్మ గౌరవాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని, నేటి యువతరానికి ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే విధంగా తీర్చిదిద్దామని చెప్పారు. తమ చిత్రానికి మలయాళ సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ అందించిన సంగీతం, యువ పాటల రచయిత హర్షవర్ధన్ రెడ్డి అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచిందని, తన దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి సినిమాలో ప్రముఖ సింగర్స్ జావేద్ అలీ, యాజిన్ నిజార్ , సైనోరా లాంటి దేశంలోని ప్రముఖ సింగర్స్ చేత పాడించడం, ‘ నచ్చిన వాడు ‘ ఆల్బమ్ మ్యూజికల్ హిట్ అయ్యి, ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూట్యూబ్ లో ప్రేక్షకాదరణ పొందడంపై హర్షం వ్యక్తం చేశారు.
విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 10 సంవత్సరాలు దర్శకత్వ శాఖలో పనిచేసే, ఒక మంచి కథతో దర్శకుడు గా మీ ముందుకు వచ్చానని, కొత్త తరం నటులని ప్రోత్సహించాలనే సంకల్పంతో తెలుగు, కన్నడ నటులకు అవకాశం ఇచ్చి, కర్ణాటక పాండిచ్చేరి గోవా లాంటి ప్లేసెస్ లో షూటింగ్ మొత్తం పూర్తి చేస్తామని చెబుతూ, ఈనెల 22న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులందరూ ఆదరించాలని అభిలాష వ్యక్తం చేశారు దర్శకుడు లక్ష్మణ్ చిన్నా.
చిత్రం పేరు : నచ్చినవాడు
నటి నటులు : లక్ష్మణ్ చిన్నా, కావ్య రమేష్, కె. దర్శన్, నాగేంద్ర అరుసు, లలిత నాయక్, ప్రేరణ బట్, ఏ.బి. అర్.పి. రెడ్డి, ప్రవీణ్ మరియు తదితరులు
పబ్లిసిటీ డిజైనర్ : అనిల్, సాయి
సౌండ్ ఎఫెక్ట్స్ : ఎతిరాజ్
కలారిస్ట్ : R. గోపాల కృష్ణన్
ఆర్ట్ డైరెక్టర్ : నగేష్, గగన్
DOP : అనిరుద్
ఎడిటర్ : K.A.Y. పాపా రావు
అసోసియేట్ డైరెక్టర్ : మనోజ్ కుమార్, విశ్వనాధ్, ఫణికుమార్
పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ పి ఆర్ ఓ : విజయ్ నాగ్ యార్లగడ్డ (విజయ్ డిజి టెక్ )
కొరియోగ్రఫీ : ఆర్య రాజ్ వీర్
సాహిత్యం – హర్షవర్ధన్ రెడ్డి
సంగీతం – మెజ్జో జోసెఫ్
ప్రాజెక్ట్ మేనేజర్ – వినోద్ కావూరి
కథ, కథనం, దర్శకత్వం : లక్ష్మణ్ చిన్నా
నిర్మాతలు : లక్ష్మణ్ చిన్నా,వెంకటరత్నం