నాందితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు హీరో అల్లరి నరేష్. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల రూపొందించిన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ ప్రేక్షకాదరణతో విజయంవంతగా రన్ అవుతోంది. ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చూసి టీమ్ అందరినీ అభినందించడానికి హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో `నాంది అప్రిసియేషన్ మీట్`ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “నా 20 ఏళ్ల కెరీర్లో మొదటిసారి ఒక సినిమాతో నాకు ఎలాంటి సంబంధం లేకున్నా సినిమా చూసి నాకు బాగా నచ్చి ఆ టీమ్ ను ఎలా అయినా అప్రిషియేట్ చేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాద్ ఐమాక్స్ లో ఈ సినిమా చూశాను. ప్రసాద్‌లోనే ఈ సినిమాకు విజియ్ నా దగ్గర మూడు సినిమాలకు అసోసియేట్ గా పని చేశాడు. ఎన్నో ట్విస్టులు, టర్న్ లతో ఈ సినిమాను చక్కగా తీశాడు. లాయర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ చాలా బాగా నటించారు. ఆమె పాత్రకి మంచి అప్రిసియేషన్ వస్తోంది. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఏదో ఒక సీన్ హార్ట్ టచింగ్ గా ఉంది. నరేష్ ఎంత మంచి ఆర్టిస్టో మనందరికీ తెలుసు. రీసెంట్ గా మా మహర్షి ఈ సినిమాతో కూడా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఒక మంచి సినిమా తీస్తే ఆ సినిమా మా అవార్డ్స్ తెలుస్తుంది అలాగే గౌరవాన్ని, డబ్బును కూడా తీసుకొస్తుంది. ఈ సినిమాకు మంచి టీమ్ కుదిరింది. ఒక మంచి టీమ్‌తో ఒక మంచి సినిమా తీస్తే ఆ కిక్కే వేరు. నిర్మాత సతీష్ గారు ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.
చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ – “ఏ దర్శకుడికైనా దిల్ రాజు గారి బ్యానర్లో సినిమా చేయాలని లైఫ్ యాంబిషన్ గా ఉంటుంది. దిల్ రాజు గారి బ్యానర్లో నేను మూడు సినిమాలకు పని చేయడం జరిగింది. ఆయన ఎప్పుడూ కమర్షియల్ సినిమాలు కాదు ఒక మంచి సినిమా చేయి అని చెప్పేవారు. ఇప్పుడు నేను తెరకెక్కించిన ఫస్ట్ మూవీ నాంది నచ్చి ఆయన మా టీమ్ అందరిని అప్రిషియేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయి ఈ రోజు ప్రేక్షకుల సపోర్టుతో ఒక మంచి సినిమాగా వెళుతోంది. ఇలాంటి తరుణంలో రాజుగారు సపోర్ట్ లభించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి సతీష్ గారికి థాంక్యు వెరీ మచ్” అన్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ – “ఇది నేను పాల్గొంటున్న ఫస్ట్ అప్రిసియేషన్ మీట్. దిల్ రాజు గారి లాంటి ఒక పెద్ద నిర్మాత ఇలాంటి మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తే నూతన దర్శకులు, నిర్మాతలు ఇంకా మంచి సినిమాలు తీయడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణంగా నేను ప్రతి సినిమాలో విలన్‌గా చేస్తాను కాబట్టి ఒకటి నన్ను చంపుతారు లేదా ఓడిస్తారు.. కానీ నీ ఈ సినిమాలో ఫస్ట్ టైం నేను గెలిచాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన విజయ్ గారికి సతీష్ గారికి థాంక్స్” అన్నారు.
హీరో నరేష్ మాట్లాడుతూ – “ఈ సినిమా ఆడడానికి కారణం నమ్మకం మరియు హార్డ్ వర్క్. ఒక దర్శకుడు ఎలాంటి కథతో వచ్చినా మన మీద మనం నమ్మకంతో ఆ క్యారెక్టర్ లోకి వెళ్లి నటించాలని ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. అలా మనల్ని నమ్మడానికి ఒక మంచి మనుషులు కావాలి అలాంటి వారే విజయ్, సతీష్. మా టీమ్ అందరూ కూడా ఈ కథను నమ్మి 100% హార్డ్ వర్క్ చేసి ఒక మంచి సినిమాని మీ ముందుకు తీసుకు వచ్చారు. దిల్ రాజు గారు ఎప్పుడో కొత్త టాలెంట్‌ని, కొత్త డైరెక్టర్స్ ని, కొత్త ఆర్టిస్ట్ లని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మా సినిమా చూసి మా టీమ్ అందరినీ అప్రషియేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకు మంచి హిట్ పడాలని చాలా మంది కోరుకున్నారు. ఈ సినిమా వారందరికీ డెడికేట్ చేస్తున్నాను” అన్నారు.
చిత్ర నిర్మాత సతీష్ వేగేశ్న మాట్లాడుతూ – “రామానాయుడుగారు, అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారి స్ఫూర్తితో నేను ఈ ఇండస్ట్రీ లోకి రావడం జరిగింది. దిల్ రాజు గారు ప్రతిరోజు ఉదయాన్నే సెట్ కి వెళ్లి పొడక్షన్ వ్యవహారాల్ని దగ్గరుండి చూసుకుంటారు. ఆయన్ని ఇన్స్పైర్ గా తీసుకొని నేను కూడా ఈ సినిమా మా ప్రొడక్షన్ వ్యవహారాలు దగ్గరుండి చూసుకోవడం జరిగింది. నా రోల్ మోడల్ గా భావించే దిల్ రాజు గారికి నేను చేసిన మొదటి ప్రయత్నం నచ్చి తనకు తానుగా ముందుకొచ్చి మా టీమ్‌ని అప్రిషియేట్ చేయడం నా లైఫ్‌లో ఒక బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్“ అన్నారు.
ఈ కార్యక్రమంలో నాంది చిత్ర యూనిట్ పాల్గొని దిల్‌రాజుగారికి దన్యవాదాలు తెలిపారు.
Pro: Vamsi – Shekar
9581799555 – 9553955385