చంద్రబోస్ చేతుల మీదుగా ‘మిస్టరీ’ సినిమా పాట విడుదల

187

పి.వి.ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మాత గా తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మిస్టరీ”. తనికెళ్ల భరణి, అలీ, సుమన్ లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా లో సాయికృష్ణ, స్వప్న చౌదరి హీరో హీరోయిన్ గా నటించారు. అయితే ఈరోజు సంగీత దర్శకుడు రామ్ తవ్వ స్వరపరిచిన ‘ఎదురయ్యే సవాళ్లు’ పాట ను ఆస్కార్ అవార్డు విజేత పాటల రచయిత చంద్రబోస్ గారు విడుదల చేశారు. ‘మిస్టరీ’ చిత్రం అక్టోబర్ 13న విడుదల అవుతుంది.

ఈ సందర్భంగా పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ “మిస్టరీ సినిమా లో ‘ఎదురయ్యే సవాళ్లు’ అనే గీతాన్ని ఆవిష్కరించాను, పాట చాలా బాగుంది. ఈ పాటకి సాహిత్యం అందించిన శ్రీనివాస్ సూర్య కి, పాడిన మనోజ్ కి అభినందలు. సినిమా లో కథానాయికగా చేసిన స్వప్న చౌదరి నాకు ఆస్కార్ వచ్చినప్పుడు మొదటగా మా ఊర్లో నా సన్మాన కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించింది, చాలా చురుకైన అమ్మాయి, అలాగే డైరెక్టర్ గా కథానాయకుడిగా తల్లాడ సాయికృష్ణ ప్రతిభ చాలా ఆమోగం, సాయికృష్ణ కి మంచి భవిష్యత్తు ఉంది, చిత్ర నిర్మాత కి చిత్ర బృందానికి విజయం చేకూరాలని ఆశిస్తున్నాను.

డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ “ఇది ఒక కామెడీ థ్రిల్లర్ సినిమా, అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది, ఈ రోజు మా సినిమా లో ‘ఎదురయ్యే సవాళ్లు’ పాట ను చంద్రబోస్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది, ఈ పాట అందరికి నచ్చుతుంది, సినిమా అక్టోబర్ 13న విడుదల అవుతుంది” అని తెలిపారు.

హీరోయిన్ స్వప్న చౌదరి అమ్మినేని మాట్లాడుతూ “నేను అడగగానే మా సినిమా లోని పాటని చంద్రబోస్ గారు విడుదల చేయడం నా అదృష్టం గా భావిస్తున్నాను, నాకు ఒక తండ్రి లాగా నా భవిష్యత్తు బాగుండాలి అని చంద్రబోస్ గారు ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వెంకట్ దుగ్గి రెడ్డి, రవి రెడ్డి, బాబీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను”.

సత్య శ్రీ, గడ్డం నవీన్, అకెల్లా, షన్ను, సి.కే.రెడ్డి, శోభన్ లు నటిస్తున్న ఈ సినిమా కి కథ మాటలు- శివ కాకు,సాహిత్యం- శ్రీనివాస్ సూర్య, గానం- మనోజ్, సంగీతం- రామ్ తవ్వ , కెమెరా – సుధాకర్ బార్ట్లే, ఎడిటింగ్ – సూర్య తేజ గంజి.