‘ముఖ్య గమనికి’ టీజర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది..త‌ప్ప‌కుండా టీమ్ అంద‌రికీ మంచి బూస్ట‌ప్ ఇస్తుంది – ద‌ర్శ‌కుడు మారుతి

161


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌జిన్ విరాన్ ముత్తం శెట్టి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న సినిమా `ముఖ్య గ‌మ‌నిక‌`. సీనియ‌ర్‌ సినిమాటోగ్రాఫ‌ర్ వేణు ముర‌ళీధ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. లావ‌ణ్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. శివిన్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రాజ‌శేఖ‌ర్‌, సాయికృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ సింగిల్ `ఆ క‌న్ను చూపుల్లోనా..` పాట‌కు శ్రోత‌ల‌నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా మూవీ టీజ‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు మారుతి విడుద‌ల చేశారు..ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది..ఈ సంద‌ర్భంగా..

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ – “మా బ‌న్నీబాబు క‌జిన్ విరాన్ హీరోగా న‌టించిన `ముఖ్య‌గ‌మ‌నిక` టీజ‌ర్ చూశాను.. చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ఒక మంచి థ్రిల్ల‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కింద‌ని తెలుస్తోంది. కానిస్టేబుల్‌గా విరాన్ క్యారెక్ట‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ వేణుగారు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శివిన్ ప్రొడ‌క్ష‌న్స్‌పై రాజ‌శేఖ‌ర్ నిర్మించారు..డెఫినెట్‌గా ఈ సినిమా టీమ్ అంద‌రికీ మంచి బూస్ట‌ప్ ఇస్తుంద‌ని ఆశిస్తున్నాను. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

హీరో విరాన్ ముత్తంశెట్టి మాట్లాడుతూ.. ‘మారుతి గారు మా టీజర్‌ను రిలీజ్ చేసి ఆల్ ది బెస్ట్ తెలిపారు. టీజ‌ర్ అంద‌రికీ న‌చ్చింద‌ని భావిస్తున్నాను, డైరెక్టర్‌గా, డీఓపీగా వేణు గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెర‌కెక్కించారు. ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’అన్నారు.

దర్శకుడు వేణు మురళీధర్ మాట్లాడుతూ.. ‘మా సినిమా టీజర్‌ను రిలీజ్ చేసిన మారుతి గారికి థాంక్స్. మా మూవీ నుంచి వచ్చిన ఫ‌స్ట్ సాంగ్ అందరికీ నచ్చింది. టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను. థ్రిల్లింగ్ అంశాల‌తో సాగే ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ డ్రామాగా ఈ మూవీ తెర‌కెక్కింది. విరాన్ చ‌క్క‌గా న‌టించారు. ఒక మంచి ప్ర‌య‌త్నంతో మీ ముందుకు వ‌స్తున్నాం. మీడియా ముందుండి మా సినిమాను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత రాజ‌శేఖ‌ర్‌ మాట్లాడుతూ.. ‘మా శివిన్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌లో రూపొందుతున్న ఫ‌స్ట్‌మూవీ `ముఖ్య‌గ‌మ‌నిక` టీజర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు మారుతి గారికి థాంక్స్. ఆల్రెడీ మా మూవీలోని ఫ‌స్ట్ సాంగ్ `ఆ కళ్ల చూపుల్లోనా..`కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే మా టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను’అని అన్నారు.

నటుడు బాషా మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. హీరో విరాన్ ఈ చిత్రం తరువాత పెద్ద స్థాయికి వెళ్తారు. టీం అంతా కష్టపడి ఈ సినిమాను చూశాం. టీజర్ అద్భుతంగా ఉంది’ అని అన్నారు.

న‌టి ఆర్యాన్ మాట్లాడుతూ.. ‘ముఖ్య గమనిక వంటి మంచి చిత్రంలో నాకు పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. హీరో విరాన్ చాలా హంబుల్ పర్సన్. ఎంతో చక్కగా నటించారు. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.

విరాన్ ముత్తం శెట్టి, లావ‌ణ్య హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి

ద‌ర్శ‌కత్వం: వేణు ముర‌ళీధ‌ర్.వి
బేన‌ర్: శివిన్ ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌లు: రాజ‌శేఖ‌ర్, సాయికృష్ణ‌
సంగీతం: కిర‌ణ్ వెన్న‌
సింగ‌ర్స్‌: న‌కాశ్ అజీజ్, రేవ‌తి శ్రిత‌
ఎడిట‌ర్‌: శివ శార్వాణి
పీఆర్ఓ: శ్రీ‌ను – సిద్ధు.