కార్తిక్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీమతి వడ్ల నాగ శారద సమర్పణలో `బర్నింగ్ స్టార్` సంపూర్ణేష్ బాబు, అద్వితి శెట్టి హీరో హీరోయిన్లుగా వడ్ల జనార్థన్ దర్శకత్వంలో గురురాజ్, కార్తిక్ నిర్మిస్తోన్న చిత్రం `మిస్టర్ బెగ్గర్`. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు సత్య ప్రకాష్ క్లాప్ కొట్టగా కార్తీ మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత రాజు కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు వి. సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నటుడు సత్య ప్రకాష్ మాట్లాడుతూ…“ఈ చిత్రంలో నేను భద్ర అనే పాత్రలో మెయిన్ విలన్ గా నటిస్తున్నా. యువ నిర్మాతలు, యువ టెక్నీషియన్స్ పని చేస్తోన్న ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ…“ దర్శకుడు జనార్థన్ గారు అద్భుతమైన స్క్రిప్ట్ తో ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా గోవా బ్యాక్ డ్రాప్ లో చాలా వరకు ఉంటుంది. వచ్చే నెలలో గోవా షెడ్యూల్ ప్లాన్ చేశాం. `హృదయ కాలేయం` చిత్రం నుంచి నన్ను ఇప్పటి వరకూ ఆదరిస్తూ వచ్చారు. ఈ సినిమాను కూడా అదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఎన్నో పెద్ద చిత్రాల్లో నటించిన సత్యప్రకాష్ గారితో నటించడం చాలా హ్యాపీ. ఇంకా చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్స్ మా సినిమాలో నటిస్తున్నారు“ అన్నారు.
రైటర్ పోలూరి ఘటికాచలం మాట్లాడుతూ…“ఈ కథ పైన దాదాపు ఏడాది కాలం వర్క్ చేశాం. స్క్రిప్ట్ చాలా బాగొచ్చింది. ఇందులో హీరో పాత్ర, విలన్ పాత్ర రెండూ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. యంగ్ ప్రొడ్యూసర్స్, యంగ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు“ అన్నారు.
దర్శకుడు వడ్ల జనార్థన్ మాట్లాడుతూ…“మిస్టర్ బెగ్గర్ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సరదా సరదాగా సాగే కుటుంబ కథా చిత్రానికి మంచి వినోదం పొందు పరిచాము. సంపూ గారి మేనరిజానికి తగ్గట్టుగా స్క్రిప్ట్ రెడీ చేశాం. బాంబే, చెన్నై, గోవాల్లో సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ ప్లాన్ చేశాం“అన్నారు.
కార్తీ మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత రాజు మాట్లాడుతూ…“ యంగ్ అండ్ టాలెంటెడ్ టీమ్ పని చేస్తోన్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా“ అన్నారు.
నిర్మాతలు గురురాజ్, కార్తిక్ మాట్లాడుతూ…“ఈ చిత్రాన్ని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నాం“ అన్నారు.
సంగీత దర్శకుడు పిఆర్ మాట్లాడుతూ…“మ్యూజిక్ కి స్కోపున్న సినిమా ఇది. సంపూ గారితో వర్క్ చేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరిందన్నారు. “ అవకాశం పట్ల ఆనందాన్ని వ్యక్తపరిచింది “ హీరోయిన్ అదితి శెట్టి.
సత్య ప్రకాష్, అలీ, బాబు మోహన్, పృథ్వీ, రఘుబాబు, రచ్చ రవి, ఫిష్ వెంకట్, ఆనంద్ , గబ్బర్ సింగ్ బ్యాచ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః పిఆర్, సినిమాటోగ్రఫీః ఫణీంద్ర వర్మ అల్లూరి; ఎడిటర్ః ఎం.ఆర్ వర్మ; ఫైట్స్ః పృథ్వీ శేఖర్; పీఆర్వోః కుమార్ స్వామి; కథ, మాటలుః పోలూరి ఘటికాచలం; నిర్మాతలుః గురురాజ్, కార్తిక్ ; దర్శకత్వంః వడ్ల జనార్థన్.