HomeTeluguఘనంగా యంపి బాలశౌరి కుమారుని నిశ్చితార్థం....

ఘనంగా యంపి బాలశౌరి కుమారుని నిశ్చితార్థం….


మచిలీపట్నం యం.పి బాలశౌరి కుమారుడు అనుదీప్‌ నిశ్చితార్థం స్నికితతో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హైటెక్‌సిటీలోని హైటెక్స్‌ కన్వెన్షన్‌లో వేసిన భారీ సెట్‌లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలు పాల్గొని కాబోయో నూతన వధువరులను ఆశీర్వదించారు. ప్రముఖ నటుడు చిరంజీవి దంపతులు నూతన దంపతులకు ఉంగరాలను అందించి వారి జీవితంలోని తొలి అడుగులకు సాక్షిగా నిలిచారు. రెండు తెలుగు రాష్ట్రాలనుండి దాదాపు 20మంది యంపీలు, 100మంది యంఎల్‌ఏలు పాల్గోని వేడుకని రెట్టింపు చేశారు. ఈ కార్యక్రమంలో అనేకమంది ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు పాల్గొని నూతన జంటకు అభినందలనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనా«ద్‌ రెడ్డి, మేకతోటి సుచరిత తదితర మంత్రులు పాల్గొన్నారు. నటులు కైకాల సత్యనారయణ, దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, ఎస్‌.గోపాల్‌రెడ్డి, రమేశ్‌వర్మ, త్రినాధరావు నక్కినలు పాట్గొనగా నిర్మాతలు కోనేరు సత్యనారయణ , మహేశ్‌ రెడ్డి, లగడపాటి శ్రీధర్, దాసరి కిరణ్‌కుమార్, విసు, సంగీత దర్శకులు కోటి, టాలీవుడ్‌ అగ్ర రచయిత బుర్రా సాయిమాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES