అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ టీజ‌ర్ విడుద‌ల

986


అఖిల్ అక్కినేని ఈ మ‌ధ్యే అమ్మో మ్యారేజా అంటూ ప్రీటీజ‌ర్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకున్నాడు. ఈ ఒక్క‌మాట‌కి తెలుగు రాష్ట్రాల్లో బ్యాచ్ ల‌ర్స్ అంద‌రూ ఫిదా అయ్యారు.. ఇప్ప‌డు మీ మ్యారేజ్ లైఫ్ నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నార‌ని అడుగుతున్నాడు. అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా మ‌రో నిర్మాత వాసు వ‌ర్శ‌తో కలిసి రూపొందిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ‌లర్. ఈ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ కి జోడిగా బుట్ట బొమ్మ పూజా హెగ్ధే న‌టిస్తోంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, గీతాగొవిందం చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన‌ గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు, ఇక ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఈ సినిమా ప్రీట‌జ‌ర్ లో కెరీర్ సెట్ చేసుకున్నా, మ్యారీడ్ లైఫ్ మాత్రం అయ్యేయో అంటూ ప్రేక్ష‌కుల‌కి టీజ‌ర్ పై ఉత్కంఠ క‌లిగేలా చేశారు అఖిల్ అక్కినేని. విజ‌యద‌శ‌మి కానుక‌గా నేడు విడుద‌లైన టీజ‌ర్ లో మీ మ్యారేజ్ లైఫ్ నుంచి మీరేమ్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు అంటూ కొంద‌రు అమ్మాయిల్ని అడిగిన అఖిల్ అనేక స‌మాధానాలు త‌రువాత కొంచెం వైల్డ్ గా థింక్ చేయ‌డంటూ చెప్ప‌డం, ఆ త‌రువాత హీరోయిన్ పూజా హెగ్ధే ఎంట్రీ ఇవ్వ‌డం, నాకు స‌న్ సెట్ అంటేనే ఇష్టం ఎందుకంటే స‌న్ సెట్ అయ్యాకే రాత్రి వ‌స్తుంద‌ని అఖిల్ అక్కినేని ప‌లికిన రొమాంటిక్ సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకున్నాయి. అఖిల్ అడిగిన ప్ర‌శ్న కి పూజా చెప్పిన చివ‌రి డైలాగ్‌ హైలెట్ గా నిలుస్తున్నాయి. మొత్తంగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న‌దైన శైలిలో అఖిల్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే రీతిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ‌ల‌ర్ చిత్రాన్ని తెరెకెక్కిస్తున్న‌ట్లుగా ఈ టీజ‌ర్ తో తెలియజేశారు.

సంక్రాంతి కి సిద్ద‌మ‌వుతున్న రొమాంటిక్‌‌ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ మెస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్

ఇప్ప‌టికే 80% షూటింగ్ ని పూర్తిచేసుకున్న రొమాంటిక్ ఫ్యామిలి ఎంటెర్టైనెర్ సంక్రాంతి కానుక‌గా రానుంది. ఈ చిత్రం లో ఫ్యామిలి ఎమొష‌న్స్ తో పాటు యూత్ కి కావ‌ల‌సిన అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. చ‌క్క‌టి మాట‌ల తో పాట‌ల‌తో ఆలోచించే క‌థ తో ఆనందించే క‌ద‌నం తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాని ప్రోడ‌క్ష‌న్ వాల్యూస్ తో ఈ సంక్రాంతి కి ఫ్యామిలి అంతా క‌లిసి చూసి ఆనందిచే చిత్రం మొస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్‌. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌, బ‌న్నివాసు, వాసు వ‌ర్మ‌, జిఏ2 పిక్చ‌ర్స్ కాంబినేష‌న్ లో అందర్ని అల‌రించటానికి వ‌స్తున్నారు. ఈ చిత్రం లో ముర‌ళి శ‌ర్మ‌, ఆమ‌ని, సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీను చాలా మంచి పాత్ర ల్లో క‌నిపిస్తారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2021 లో జ‌న‌వ‌రి సంక్రాంతి కి విడుద‌ల చేయటానికి నిర్మాతలు స‌న్నాహ‌లు చేస్తున్నారు.

న‌టీ న‌టులు

అఖిల్ అక్కినేని
పూజా హెగ్ఢే
ఆమ‌ని
ముర‌ళి శ‌ర్మ‌
జ‌య ప్ర‌కాశ్
ప్ర‌గ‌తి
సుడిగాలి సుధీర్
గెటెప్ శ్రీను
అభ‌య్
అమిత్

సాంకేతిక నిపుణులు..

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ
ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్
ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా
పి ఆర్ ఒ – ఏలూరు శ్రీను
నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌
డైరెక్ట‌ర్ : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్