HomeTeluguఈ నెల 17న గ్రాండ్ గా విడుద‌ల‌వుతోన్న `మొన‌గాడు`

ఈ నెల 17న గ్రాండ్ గా విడుద‌ల‌వుతోన్న `మొన‌గాడు`

కీలుగుఱ్ఱం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఆకుల వంశీ, పావని, దేవ్ గిల్, ఛ‌త్రపతి శేఖర్ మొదలగువారు నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం మొనగాడు . వంశీ ఆకుల స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత వంశీ ఆకుల మాట్లాడుతూ…“ల‌వ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా మొన‌గాడు చిత్రాన్ని తెర‌కెక్కించాం. అన్ని కార్య‌క్ర‌మ‌లు పూర్తి చేసుకుని ఈ నెల 17న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఇంద‌లో దేవ్ గిల్‌, ఛ‌త్ర‌ప‌తి పాత్ర‌లు చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటాయి. నాలుగు ఫైట్స్, రెండు పాట‌లు ఆద్యంతం ఆక‌ట్టుకుంటాయి. మా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాం“ అన్నారు.

దేవ్‌గిల్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, రాజ‌శేఖ‌ర్‌, కోమ‌ల్ జా, చిట్టిబాబు త‌దితరులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్ః ఉద‌య్ భాస్క‌ర్‌; సంగీతంః ర్యాప్ రాక్ ష‌కీల్‌; ఎడిట‌ర్ః బొంతాల నాగేశ్వ‌ర‌రెడ్డి; ఫైట్స్ః దేవ‌రాజ్ నూనె; సౌండ్ ఎఫెక్ట్స్ః య‌తిరాజ్‌; కొరియోగ్ర‌ఫీః రాధ‌; నిర్మాత-ద‌ర్శ‌కుడుః వంశీ ఆకుల‌.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES