మెజో టీవీ మాజీ సీఈఓ పై ఎస్సి,ఎస్టీ కేసు …..!

675

మోజో టివి మాజీ సిఈఓ రేవతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు..రేవతి ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అదుపులోకి తీసుకున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు ..రేవతి అరెస్ట్ పై ఆమె భర్త చైతన్య తీవ్రంగా మండిపడుతున్నారు . SC st కేసు పై ఈరోజు నా భార్య రేవతి ని బంజారాహిల్స్ పొలుసులు అరెస్ట్ చేశారని …గతంలో ఇచ్చిన నోటీసులు కి స్పందించామని …అవసరం అనుకుంటే మేమే విచారణకు పిలిస్తాం అని పొలీసులు తెలిపారని కానీ ఈరోజు ఉదయం మా ఇంట్లోకి పొలుసులు ప్రవేశించి రేవతి ని బలవంతంగా ఈడ్చుకెళ్లారని అన్నారు .. వీడియో లు తీస్తుంటే నా మొబైల్ ను లాకున్నారని ,పోలీసులు విచారణ కి రేవతి సహకరిస్తుందన్నారు ..నేను తీసిన సినిమాలు అన్ని కూడా పోలీసులు డిపార్ట్మెంట్ కి చెందినవే, పోలీసులు పై నమ్మకం ఉంది, మేము లీగల్ గా ముందుకు వెల్లుతున్నాం , ఈరోజు రేవతి ని పోలీసులు విచారణ పేరుతో తీసుకొచ్చిన విధానం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం హైకోర్టు లో క్వాష్ పిటిషన్ కూడా వేశాము, బెయిల్ పిటిషన్ కూడా వేస్తామన్నారు ..గతంలో రేవతి మోజో టీవీ లోనే దీక్షకు దిగిన విషయం కూడా మనకు తెలిసిందే ..