HomeTeluguఊల్లాల ఊల్లాల చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ఐ.టి మినిస్టర్ కేటీఆర్

ఊల్లాల ఊల్లాల చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ఐ.టి మినిస్టర్ కేటీఆర్

నటరాజ్, నూరిన్, అంకిత హీరో-హీరోయిన్లు గా రూపొందుతున్న చిత్రం “ఊల్లాల ఊల్లాల”. సీనియర్ నటుడు ‘సత్య ప్రకాష్” ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయo అవుతుండగా సుఖీభవ మూవీస్ పతాకంపై ఏ. గురురాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలను తన గానంతో ఉర్రూతలూగించిన మంగ్లీ తొలిసారిగా “ఊల్లాల ఊల్లాల” చిత్రం లో నటించడమే కాక హీరోయిన్ నూరిన్ కి డబ్బింగ్ చెప్పింది. తను పాడిన ‘రాం రాం’ పాట గురువారం విడుదలకి సిద్ధంగా ఉంది.

ఈ సందర్భంగా నిర్మాత గురురాజ్ తెలంగాణ ఐ.టి మినిస్టర్ కే.టీ.ఆర్ ని కలిసినప్పుడు, ఆయన నిర్మాత ఏ.గురురాజ్ కి, దర్శకుడు సత్యప్రకాష్ కి, హీరో నటరాజ్ కి, గాయని మంగ్లీకి మరియు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలపడమే కాక సుఖీభవ క్రీయేషన్స్ పతాకంపై నిర్మించే చిత్రాలన్నీ మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. అదే సమయంలో అక్కడే ఉన్న తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ ని కేటీఆర్ గారు, నిర్మాతకి పరిచయం చేయగా, ఆయన కూడా చిత్రానికి తనవంతు సహాయం చేస్తానని, చిత్రం మంచి విజయం సాధించేలా తోడ్పడతానని తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత ఏ . గురురాజ్ మాట్లాడుతూ.. మా బేన‌ర్‌లో `ర‌క్ష‌క‌భ‌టుడు`, `ఆనందం మ‌ళ్లీ మొద‌లైంది`, `ల‌వ‌ర్స్ డే` చిత్రాల త‌ర్వాత వ‌స్తున్న సినిమా `ఉల్లాలా ఉల్లాలా`. ఇలాంటి కాన్సెప్ట్ లుచాలా అరుదుగా వ‌స్తుంటాయి. స‌త్య‌ప్ర‌కాశ్‌కి న‌టునిగా ఎంత పేరుందో, ద‌ర్శ‌కునిగాఅంత‌క‌న్నా ఎక్కువ పేరు ఈ చిత్రం ద్వారా వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాను. ఈ చిత్రాన్ని జనవరి 1న భారీగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నం” అని తెలిపారు.

అదే సమయంలో దర్శకుడు స‌త్య‌ప్ర‌కాశ్‌ గారు మాట్లాడుతూ “నేను దర్శకునిగా మా అబ్బాయిని నటరాజ్ ను ఈ చిత్రంతో హీరో గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాను అని చెప్పగా ” కేటీఆర్ గారు మీ అబ్బాయి మంచిగా ఎదగాలి.మీరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలి ” అని చెప్పారు.

తారాగ‌ణం:
న‌ట‌రాజ్‌, నూరిన్‌, అంకిత‌, గురురాజ్‌, స‌త్య‌ప్ర‌కాష్‌, `బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్‌, పృథ్వీరాజ్‌, `అదుర్స్` ర‌ఘు, జ‌బ‌ర్ధ‌స్త్ న‌వీన్‌, లోబో, మ‌ధు, జ‌బ‌ర్ధ‌స్త్ అప్పారావు, రాజ‌మౌళి, జ్యోతి, గీతాసింగ్‌, జ‌య‌వాణి త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి ఎ.ముత్త‌మ్మ‌
ఛాయాగ్ర‌హ‌ణం: జె.జి.కృష్ణ‌, దీప‌క్‌
సంగీతం: జాయ్‌
ఎడిటింగ్‌: ఉద్ధ‌వ్‌
నృత్య ద‌ర్శ‌క‌త్వం: శేఖ‌ర్ మాస్ట‌ర్‌, దిలీప్ కుమార్‌
యాక్ష‌న్‌: డ్రాగ‌న్ ప్ర‌కాష్‌
ఆర్ట్: కె.ముర‌ళీధ‌ర్‌
పాట‌లు: కాస‌ర్ల శ్యామ్‌, గురుచ‌ర‌ణ్‌
క‌థ – స్క్రీన్ ప్లే-మాటలు- నిర్మాత‌: ఎ.గురురాజ్‌
ద‌ర్శ‌క‌త్వం: స‌త్య‌ప్ర‌కాష్‌

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES