పిట్టకథ చిత్రంతో ప్రతిభ గల హీరోగా నిరూపించుకున్న సంజయ్ రావ్ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. మైక్ మూవీస్ సంస్థ తన ప్రొడక్షన్ నెంబర్ 4వ చిత్రంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంతో డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రణవి మానుకొండ నాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్టును అందించగా, మిస్టర్ ప్రెగ్నంట్ దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి క్లాప్ నిచ్చారు. యువ హీరో సొహైల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనుందీ సినిమా.
ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ – వైష్ణవ్ వాసు, సినిమాటోగ్రఫీ – శ్రీనివాస్ జె రెడ్డి, సంగీతం – భీమ్స్ సిసిరోలియో, సాహిత్యం – కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, శ్రీనివాస్, పూర్ణా చారి, పీఆర్వో – జీఎస్కే మీడియా,
లైన్ ప్రొడ్యూసర్ – రమేష్ కైగురి,
బిజినెస్ హెడ్ : కొ వె ర
సహ నిర్మాతలు – చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల,
ప్రకాష్ జిర్ర, రవళి గణేష్, సోహంరెడ్డి మన్నెం,
నిర్మాతలు – అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి,
రచన దర్శకత్వం – డాక్టర్ ఏఆర్ శ్రీధర్.