యల్‌యన్. క్రియేషన్స్ పతాకంపై శివ రెమిడాల నిర్మాతగా, ప్రిన్స్ నవీద్ ఖాన్ మరియు కుమారి స్నేహ శర్మ తారాగణం. ‘ద స్కూలొ. ఉపశీర్షిక (ప్లేస్ ఆఫ్ లర్నింగ్)తో ప్రారంభోత్సవ కార్యక్రమం ఫిల్మ్ చాంబర్‌లో దిగ్విజయంగా జరిగింది. ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ నటులు కృష్ణ భగవాన్ మాట్లాడుతూ… ఈ చిత్రం తన గత చిత్రాలను గుర్తు చేస్తుందని ఈ చిత్రం తనకెంతో ప్రత్యేక చిత్రమవుతుందని దర్శకులు వాల్మీకీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
మరో అతిథిగా వచ్చిన సీనియర్ నటులు రాజా రవీంద్ర గారు మాట్లాడుతూ… ఎన్నో భారీ విజయాలను అందించిన దిగ్గజ నిర్మాత శ్రీ రమేష్ పుష్పాల గారు, దర్శకులు వాల్మీకితో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ సృతజనామ్హకతని కొనియాడారు.
టి.ఎఫ్.సి.సి. ఇ.సి. మెంబర్ శ్రీమతి పద్మిని నాగులపల్లి గారు కెమెరా స్విచాన్ చేసి, ఈ చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ బాలీవుడ్ మోడల్ ఈ చిత్ర కథా నాయకుడు మరియు మూలకథని అందించిన ప్రిన్స్ నవీద్ ఖాన్ మాట్లాడుతూ.. సమాజంలో జరిగే సహజ సంఘటనలకు అద్దం పట్టేలా తీర్చిదిద్దే దర్శకులు వాల్మీకీ మంచి విజయాన్ని అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దిగ్గజ రియల్ ఎస్టేట్ అనుబంధ సంస్థ ఎల్.యన్. క్రియేషన్స్ అధినేత ఈ చిత్ర నిర్మాత శ్రీ శివ రెమిడాల గారు రాజీలేని నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యయము, ఈ నమ్మకము వృధా అవ్వదని చిత్ర నిర్మాత ప్రేక్షకులకి దృఢ
సంకల్పంతో తెలియజేశారు.
నటీనటులు : నవీద్ ఖాన్, స్నేహ శర్మ, ఇంద్రజ, కృష్ణ భగవాన్, రాజా రవీంద్ర, వివా రెడ్డి, జబర్దస్త్ కార్తీక్, మల్లిక్ రాజ్, నాగేంద్ర నాయక్ రాథోడ్ తదితరులు నటిస్తున్నారు. టెక్నీషియన్స్ : పి.ఆర్.ఒ. : బాబు నాయక్, స్టోరీ : ప్రిన్స్ నవీద్ ఖాన్, డైలాగ్స్ : వాల్మీకి, అమర్, కెమెరా : విజయ్ ఠాగూర్, ఎడిటింగ్ ; నందమూరి హరి, మేకప్ : శంకర్, కాస్టూమ్ : ఏడుకొండలు, నిర్మాత : శివ రెమిడాల, సంగీతం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వాల్మీకి.