HomeTeluguఅన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'మాయా పేటిక' టీం

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘మాయా పేటిక’ టీం

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సినిమాల‌ను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి ఓ కొత్త కథతో ‘మాయా పేటిక’ అనే చిత్రం రాబోతోంది. విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, ర‌జ‌త్ రాఘ‌వ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్ ‘మాయా పేటిక’. రమేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 30న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ మాట్లాడుతూ..

నిర్మాత శరత్‌ చంద్ర మాట్లాడుతూ.. ‘థాంక్యూ బ్రదర్ సినిమాను అందరూ ఆదరించారు. ఇది మా రెండో సినిమా. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉంటాయి. రెగ్యులర్ రొటీన్ సినిమాలా ఉండదు. థియేటర్లో రాబోతోన్న మా ఈ మొదటి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’ అని అన్నారు.

డైరెక్టర్ రమేష్ రాపర్తి మాట్లాడుతూ.. ‘జస్ట్ ఆర్డినరీ బ్యానర్ నుంచి థాంక్యూ బ్రదర్ అనే సినిమాను మొదటగా తీశాం. మళ్లీ ఓ కొత్త కథ చెప్పాలని అనుకున్నాం. కానీ కొత్తగా ఉండాలని అనుకున్నాం. సెల్‌ ఫోన్‌ కథ చెప్పాలని ఫిక్స్ అయ్యాం. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ సినిమా. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. పాటలు, కామెడీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. పాయల్‌ అందరి గుండెల్ని కొల్లగొడుతుంది. జూన్ 30న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు.

విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘విరాజ్‌లో ఓ నటుడు ఉన్నాడని చెప్పిన బ్యానర్ ఇది. శరత్ చంద్ర గారికి ఓ మంచి నిర్మాతకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. థాంక్యూ బ్రదర్ సినిమా తరువాత ఓ బయోపిక్ చేద్దామని డైరెక్టర్ రమేష్‌ గారు పిలిచారు. ఫోన్ బయోపిక్ అని చెప్పడంతో షాక్ అయ్యాను. ఇందులో ఎన్నో రకాల ఎమోషన్స్ ఉంటాయి. నా మనసుకు నచ్చిన పాత్ర ఇది. ఆడియెన్స్‌కు నచ్చుతుందని ఆశిస్తున్నాను. గుణ బాలసుబ్రహ్మణ్యం సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. సురేష్‌ గారి కెమెరా వర్క్ బాగుంటుంది. శ్యామల, సునీల్ గారి కాంబినేషన్ అందరినీ నవ్విస్తుంది. పాయల్ అందరినీ ఆకట్టుకుంటుంది. పాయల్ ఈ సినిమాలో పాయల్‌గానే కనిపిస్తుంది. జూన్ 30న ఈ సినిమాను రిలీజ్ కాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

పాయల్ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లో ఈ సినిమా చాలా ముఖ్యమైంది. ఇదొక డిఫరెంట్ సినిమా. ఈ మూవీ మొత్తం కూడా ఫోన్ చుట్టూనే తిరుగుతుంది. ఆడియెన్స్‌ను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడింది. డైరెక్టర్ రమేష్ గారు కథ చెప్పడంతోనే వెంటనే ఓకే చెప్పాను. ఇందులో నేను హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ పాత్రలోనే కనిపిస్తాను. ఈ టీంతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. జూన్ 30న ఈ సినిమాను థియేటర్లో చూడండి’ అని అన్నారు.

రజత్ రాఘవ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూసిన ప్రతీసారి ఒక మంచి సినిమా తీశామనిపిస్తుంటుంది. జూన్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంత మంచి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన రానా గారికి థాంక్స్. ఈ సినిమాను చూసి అందరూ థ్రిల్‌ ఫీల్ అవుతారు’ అని అన్నారు.

సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నేను అస్రా అనే పాత్రలో కనిపిస్తాను. ఇందులో కామెడీ అద్భుతంగా ఉంటుంది. పాటలు చాలా బాగుంటాయి. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన టీంకు థాంక్స్’ అని అన్నారు.

యాంకర్ శ్యామల మాట్లాడుతూ.. ‘ప్రతీ ఒక్కరి దగ్గర ఉండే ఫోన్‌కు ఒక్కో కథ ఉంటుంది. ఆ ఫోన్‌ ఏమేం చేస్తుంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఫోన్ జర్నీని ఈ మూవీలో చక్కగా చూపించారు. నాది, సునీల్ గారి పాత్ర చాలా బాగుంటుంది. ఒకప్పుడు సునీల్ గారు ఎలా నవ్వించేవారో ఇప్పుడు మళ్లీ నవ్విస్తారు. టిక్ టాక్ కపుల్స్‌లా మేం చాలా ఫేమస్ అవుతాం. జూన్ 30న మా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES