కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు (Mohan Babu) మాట్లాడుతూ ‘‘అభిమానులందరికీ, ప్రేక్షకులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. 560కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశాను. 75 సినిమాలను నిర్మించాను. శివాజీగారి ఫంక్షన్స్‌లో, మా అన్నయ్య ఎన్టీఆర్‌గారి ఫంక్షన్‌లో , నాగేశ్వశ్వర రావుగారి ఫంక్షన్‌లో కృష్ణగారు, కృష్ణంరాజుగారు ఫంక్షన్స్‌లో.. అబ్దుల్ కలామ్ మా ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చినప్పుడు ఆ ఫంక్షన్‌లో కానీ.. ఎవరూ నన్నెప్పుడూ ఇన్ని నిమిషాలు మాట్లాడాలని చెప్పలేదు. విష్ణు బాబు మాత్రం ఈరోజు నా దగ్గరకు వచ్చి నాన్న ఈరోజు మీరు తక్కువగా మాట్లాడాలి. 50 సంవత్సరాల నట జీవితం నాది. ఎక్కువగా మాట్లాడుతుంటానా, పెద్దవాళ్లు చెప్పలేదే అనిపించింది. అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు (నవ్వుతూ..). హనుమంతుడు సీత దగ్గరకు వెళ్లినప్పుడు ఏం చెప్పాడు. రావణాసురుడు దగ్గరకు వెళ్లినప్పుడు ఏం చెప్పాడనేది ఎన్నో సందర్భాల్లో చెప్పాను. అలాగే మన గురించి మనం చెప్పుకోవాలి.
కానీ నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిడ్డలను పది మందిలో పొగడకూడదనేది శాస్త్రం. విష్ణు ఎంత గొప్పగా నటించాడనేది సినిమాలో నటించిన వారు, టెక్నీషియన్స్ చెప్పారు. నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ మూవీ అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని, సాధిస్తుందని భావిస్తున్నాను. ఢీ తర్వాత 10 రెట్లు సక్సెస్ సాధించాలి. తను ఇప్పటి వరకు చేయని విధంగా రిస్కీ షాట్స్ చేశాడు. చాలా ఎక్కువగా కష్టపడ్డాడు. కాబట్టి ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. నువ్వు బెస్ట్ హీరోవే కాదు, నీకు మంచి మనస్సుంది. కాబట్టి నీకు కుటుంబంలోని వారితో పాటు అందరి ఆశీస్సులుంటాయి.
జిన్నా సినిమాకు మూల కథను అందించిన దేనికైనా రెఢీ దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డికి, ఆ కథైతే విష్ణుకి బావుంటుందని చెప్పిన కోన వెంకట్‌కి, అలాగే ఛోటా కె.నాయుడు ఎంతో గొప్పగా నా బిడ్డను సినిమాలో చూపించాడు. కోన వెంకట్ రూపంలోనే ఆ భగవంతుడు మా కుటుంబానికి మంచి విజయాన్ని ఇవ్వాలని పంపాడని అనుకుంటున్నాను. అనూప్ విష్ణు కోసం జిన్నా సినిమా చేశాడు. అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. నా మనవరాళ్లతో ఈ సినిమాలో చక్కటి పాట పాడారు. నా బిడ్డలకు అవకాశాన్ని ఇచ్చిన అనూప్‌కి థాంక్స్. అలాగే దర్శకుడు డైలాగ్స్ రాసిన, నందు, భాను మంచి పంచ్స్‌తో రాశారు. ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్.. సినిమా ఎడిటింగ్‌లో చాలా సందర్భాల్లో మంచి విషయాలను చెప్పాడు. ఏ సీన్ ఎలా ఉంది..ఎలా ఉండాలని చెబుతూ మంచి ఎడిటింగ్ చేశాడు. ఈశ్వర్ రెడ్డి అయితే 300 జానపద పాటలను అ…
చిత్ర దర్శకుడు ఈషాన్ సూర్య మాట్లాడుతూ ‘‘జిన్నా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన మంచు ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు, అతిథులకు ధన్యవాదాలు. ఈ మూవీ నాకు రావటానికి ప్రధాన కారణం కోనం వెంకట్. మా గురువుగారు శ్రీనువైట్లతో నేను పని చేస్తున్నప్పుడు కోనగారు నా వర్కింగ్ స్టైల్ తెలుసు. అందువల్లే విష్ణుగారికి మంచి కథను తయారు చేసుకుని మోహన్‌బాబుగారి సంస్థలో సినిమా చేయాలనుకున్నప్పుడు నా పేరుని ఆయనే సజెస్ట్ చేశారు. అందుకు ఆయనకు థాంక్స్. మోహన్‌బాబుగారికి నేనెవరో తెలియదు. విష్ణుగారికి నా గురించి కాస్త తెలుసు. నా గురించి ఏమీ తెలియకపోయినా.. కోనగారికి అన్నారు.
జి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘జిన్నా సినిమా రషెష్ చూశాను. సినిమా బ్లాక్ బస్టర్. ఎవరూ డౌట్ పెట్టుకోనక్కర్లేదు. సక్సెస్‌ను రీచ్ చేసే కెపాసిటీ విష్ణుకి పుష్కలంగా ఉంది. పోస్టర్స్‌పై వేసిన జిన్నా జాతర అనే ట్యాగ్ రిలీజ్ తర్వాత నవ్వుల జాతర అని అందరూ అంటారు. త్వరలోనే జిన్నా బ్లాక్ బస్టర్ జాతర జరుగుతుంది’’ అన్నారు.
ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు.