పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఎదిగే కొద్దీ వారి మీద పరిసరాల ప్రభావం పడుతుంది. వాటిల్లో మంచి చెడు తెలుసుకోవాలంటే తల్లిదండ్రులు వారి పెంపకం మీద, ఉపాధ్యాయులు, వారి బోధన మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. వయసుతో పాటు పిల్లల ఆలోచనలు, ఆశయాలు, వ్యక్తిత్వం ఎదగాలి. అలా జరగాలి అంటే పిల్లలను తల్లిదండ్రులు ప్రశ్నించనివ్వాలి. ప్రతి ప్రశ్నకు మనం విసుక్కోకుండా సమాధానాలు ఇవ్వాలి. ఎప్పటికప్పుడు పిల్లలకు ఉండే ప్రతి చిన్న అనుమానాన్ని తొలగించాలి. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో ఇలా చేయడం ఎంతమంది తల్లిదండ్రులకు సాధ్యమవుతుంది?
ఇదే ఆలోచన నా బిడ్డ లక్ష్మిప్రసన్నకి వచ్చి, తన బిడ్డ విద్యానిర్వాణ మరియు “చాయ్ బిస్కెట్” సంస్థతో కలిసి “చిట్టి చిలకమ్మ” పేరుతో ఒక youtube channel ప్రారంభిస్తున్నానని, పిల్లల పెంపకంలో ఉండే ఒక్కో సమస్యకు ఒక్కో episode చేస్తూ, పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఉపయోగపడేలా ఆ short videos ఉంటాయని చెప్పినప్పుడు తనను కన్న తండ్రిగా గర్వపడ్డాను. ఆనందపడ్డాను. ప్రాధమిక జీవిత నైపుణ్యాలతో, తల్లిదండ్రులకు ఉపయుక్తమయ్యే చిట్కాలతో ప్రతీ శనివారం 6 PM కి ప్రసారమయ్యే ఈ Short Videos లో ప్రతీ వారం ఒక పిల్లల మానసిక వైద్యురాలు కూడా పాల్గొంటారు.
ఇవి ఆహ్లాదకరంగా, ఆమోదయోగ్యంగా, ఉపయోగపడేలా ఉండాలని, నా కుమార్తె లక్ష్మిప్రసన్న, నా ముద్దుల మనవరాలు విద్యానిర్వాణ, వారి బృందం చేసే ఈ ప్రయత్నం అద్భుత విజయం సాధించాలని ఆశీర్వదిస్తున్నాను.
– ఆశీఃపూర్వక అభినందనలతో
డా. మంచు మోహన్ బాబు