‘మళ్ళీ మళ్ళీ చూశా’ – చిత్ర నిర్మాత కె. కోటేశ్వరరావు ఇంటర్వ్యూ…

542


క్రిషి క్రియేషన్స్‌ పతాకంపై అనురాగ్‌ కొణిదెన హీరోగా పరిచయం చేస్తూ హేమంత్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ”మళ్ళీ మళ్ళీ చూశా”.. శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అక్టోబర్‌ 18న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె. కోటేశ్వరరావు ఇంటర్వ్యూ…

మీ గురించి చెప్పండి?
– మాది కృష్ణ జిల్లా. నేను ‘క్రిషి కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ని.

ఈ ప్రాజెక్ట్‌ ఎలా స్టార్ట్‌ అయింది?
– మా అబ్బాయి అనురాగ్‌ చాలా చురుకైన వాడు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసి వ్యాపారంలో నాకు తోడుగా ఉండేవాడు. రామానాయుడు యాక్టింగ్‌ స్కూల్‌లో ఆరు నెలలు ట్రైనింగ్‌ తీసుకోని డాడీ నేను మూవీలో నటిస్తాను..అన్నారు. దాంతో నేను ఒప్పుకున్నాను. తరువాత ఒక కథ అనుకోని ప్రొడ్యూసర్‌తో నాదగ్గరకు వచ్చాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రొడ్యూసర్‌ ముందుకురాలేదు. మంచి కథ కావడంతో మా అబ్బాయి కలను ఫుల్‌ఫీల్‌ చేయడానికి నేనే ప్రొడ్యూస్‌ చేయడానికిముందుకు వచ్చాను.

హీరో అనురాగ్‌ గురించి చెప్పండి?
– మా అబ్బాయి అనురాగ్‌ కొణిదెన ఈ చిత్రం ద్వారా మంచి హీరోగా పేరు తెచ్చుకుంటాడని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే మొదటి నుండి ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదివాడు. చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. ఫస్ట్‌ నుండి కూడా చాలా డిసిప్లేన్డ్‌ పర్సన్‌. నాది ఈ ఫీల్డ్‌ కాకపోయినా మా బాబు చెప్పాడంటే దానిలో తప్పకుండా విషయం ఉంటుంది అన్న నమ్మకంతో ఈ సినిమా చేశాను.

మళ్ళీ మళ్ళీ చూశా స్టోరీ లైన్‌ ఏంటి?
– ఇది స్టూడెంట్స్‌ లైఫ్‌కి సంబంధించిన ఒక యూత్‌ ఫుల్‌ ఎంటర్టైనర్‌. ఒక స్టూడెంట్‌ తనకి దొరికిన డైరీ సాయంతో ఒక అమ్మాయి ప్రేమను ఎలా గెలుచుకున్నాడు, దానిలో భాగంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది అనే పాయంట్‌ను దర్శకుడు చాలా గ్రిప్పింగ్‌గా చెప్పడం జరిగింది. స్టూడెంట్‌ లైఫ్‌కి సంబందించిన లవ్‌ స్టోరీస్‌ తక్కువగా వస్తున్న ఈ తరుణంలో ‘మళ్ళీ మళ్ళీ చూశా’ యూత్‌తో పాటు ఫ్యామిలీస్‌కి బాగా కనెక్ట్‌ అవుతుంది.

ఈ సినిమాలో మీకు ఏ పాయింట్‌ బాగా నచ్చింది?
– ఈ సినిమాలో ఫైట్స్‌, పాటలు ఇలా అన్ని అంశాలు నాకు బాగా నచ్చాయి. సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకూ నెక్స్ట్‌ ఏం జరుగుతుంది? అనే ఫ్లోని అలాగే కంటిన్యూ చేశారు దర్శకుడు హేమంత్‌ కార్తిక్‌. ఒక మంచి ఫీల్‌ గుడ్‌ ఎంటర్టైనర్‌లా ఈ సినిమాను తెరక్కించాడు. అలాగే శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం, ఎలేంద్ర మహావీర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు మంచి ప్లస్‌ అయ్యాయి. సతీష్‌ ముత్యాల, కల్యాణ్ సమీ బ్యూటిఫుల్‌ విజువల్స్‌ ఇచ్చారు. టోటల్‌గా సినిమా ఔట్‌ఫుట్‌ పట్ల నేను మా టీమ్‌ చాలా సంతోషంగా ఉన్నాం.

సినీ నిర్మాణరంగం మీకు కొత్త కదా! ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా?
– అలాంటిదేం లేదండి! నేను నాకు ఈ రంగం కొత్త అయినా నేను గమనించింది ఏంటంటే.. ఇక్కడ ప్రతి ఒక్కరూ చాలా డిసిప్లేన్డ్‌గా ఉంటారు. చెప్పిన టైమ్‌కి చెప్పిన పనిని కంప్లీట్‌ చేసి వెళ్తారు. అలాగే మా అబ్బాయి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సతీష్‌ పాలకుర్తి కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సినిమాను కంప్లీట్‌ చేశారు.

సినిమా బిజినెస్‌ ఎలా ఉంది?
– ఈ సినిమాను మేమే ఓన్‌ రిలీజ్‌ చేస్తున్నాం. ఏరియా వైజ్‌గా మంచి డిస్ట్రిబ్యూటర్లని సెలెక్ట్‌ చేసి అక్టోబర్‌ 18న గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నాం.

మీ అబ్బాయిని హీరోగా తెరమీద చూస్తున్నప్పుడు ఎలా ఉంది?
– చాలా సంతోషం వేసింది. అలాగే ఫైట్స్‌, డాన్సులు బాగా చేశాడు. ఈ సినిమాలో కొంత మాస్‌ కూడా ఉంటుంది దాన్ని చాలా చక్కగా చేశాడు. హీరోగా మంచి ఫ్యూచర్‌ ఉంటుంది అనిపించింది.

మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌ ఏంటి?
– మా బేనర్‌లో కంటిన్యూస్‌గా సినిమాల్ని నిర్మించాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం రెండు మూడు కథలు పరిశీలిస్తున్నాం.. మా అబ్బాయితోనే కాకుండా మంచి అవకాశం కోసం ఎదురుచూసే టాలెంటెడ్‌ టెక్నీషన్స్‌కి, యాక్టర్స్‌కి మా బేనర్‌లో అవకాశం కల్పిస్తాం. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.