మేజర్ సినిమా చూస్తున్నపుడు గూస్ బంప్స్ వచ్చాయి. మహేష్ బాబు

26

డైనమిక్ హీరో అడివి శేష్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ ని సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు.

2.28 నిమిషాలు గా ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ సాగింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వుంది. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, లవ్ లైఫ్, వార్ .. ఇలా ప్రతీదీ ట్రైలర్ లో గూస్ బంప్స్ మూమెంట్ గా వుంది. ట్రైలర్ లో 26/11 ఎటాక్ విజువల్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. అడివి శేష్ మేజర్ సందీప్ గా పరకాయ ప్రవేశం చేశారు. ప్రకాష్ రాజ్ వాయిస్ ,డైలాగ్స్ , ఆయన నటన అద్భుతంగా వుంది.

”మై సన్ ..

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ..

వెనకడుగు వేసే అవకాశం వుంది

తప్పించుకునే దారి వుంది

ముందు వెళితే చనిపోతాడని తెలుసు .. అయినా వెళ్ళాడు

చావు కళ్ళల్లో చూసి.. ‘నీవు నా జీవితాన్ని తీసుకోవచ్చు కానీ దేశాన్ని కాదు’ అన్నాడు”… ప్రకాష్ రాజ్ చెప్పిన ఈ డైలాగ్, దాని తగ్గటు చూపించిన సందీప్ పోరాటానికి చప్పట్లు కొట్టాల్సిందే.

సినిమా పై భారీ అంచనాలు పెంచిన మేజర్ ట్రైలర్ .. సినిమాని ఎప్పుడు చూస్తామా ? అనే ఆసక్తిని పెంచింది.

అభిమానుల సమక్షంలో విడుదల చేసిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ… మేజర్ టీమ్ ని చూస్తే గర్వంగా వుంది. మేజర్ ట్రైలర్ చూసినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా చూశాను. కొన్ని సీన్లు చూస్తున్నపుడు గూస్ బంప్స్ వచ్చాయి. చివరి 30 నిమిషాలు నా గొంతు తడారిపోయింది. సినిమా పూర్తయిన తరవాత ఏం మాట్లాడలేకపోయాను. రెండు నిమషాల మౌనం తర్వాత శేష్ ని హాగ్ చేసుకున్నాను. బయోపిక్ తీయడం చాలా బాధ్యత కూడుకున్నది, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి వీరుడి కథ చెప్పినపుడు ఆ భాద్యత ఇంకా పెరుగుతుంది. మేజర్ టీం మొత్తం ఆ భాద్యతని చక్కగా నిర్వహించారు. రెండేళ్ళుగా మేజర్ టీమ్ నాకు థ్యాంక్స్ చెబుతున్నారు. కానీ ఇంత గొప్ప సినిమాని ఇచ్చిన మేజర్ టీమ్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి. జూన్ 3న మేజర్ వస్తుంది. తప్పకుండా మీరు ప్రేమించే సినిమా అవుతుంది. అనురాగ్ మాట్లాడుతూ నేను రిస్క్ చేస్తానని చెప్పారు. కానీ నేను రిస్క్ చేయను. నాలుగేళ్ళుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టరే. అడవి శేష్ చేసే సినిమాలు నాకు చాలా ఇష్టం. మేజర్ సినిమా గా కూడా అద్భుతంగా ఉండబోతుంది.” అన్నారు