సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్ బండి తెరకెక్కిస్తున్న సినిమా మధుర వైన్స్. ఆర్‌కే సినీ టాకీస్ రాజేష్ కొండెపు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మధుర వైన్స్ ట్రైలర్‌ను ప్రముఖ హీరో కార్తికేయ విడుదల చేసారు. ట్రైలర్ అంతా ఎంటర్‌టైనింగ్‌గా ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. సినిమా ఇంతకంటే ఆహ్లాదకరంగా ఉంటుందని ధీమాగా చెప్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు మోహన్ చారీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే మధుర వైన్స్‌ను విడుదల చేస్తామని.. మరిన్ని వివరాలు తెలియచేస్తామని తెలిపారు దర్శక నిర్మాతలు.
నటీనటులు:
సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ తదితరులు
టెక్నికల్ టీం:
దర్శకుడు: జయ కిషోర్ బండి
నిర్మాత: రాజేష్ కొండెపు
బ్యానర్: ఆర్‌కే సినీ టాకీస్
సినిమాటోగ్రఫర్: మోహన్ చారీ
సంగీతం: కార్తిక్ కుమార్, జై క్రిష్
ఎడిటర్: వర ప్రసాద్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను
Eluru Sreenu
P.R.O