కొత్తగా దర్శకతం చేయాలనుకునే వారందరికి మత్తు వదలరా చిత్రం ఓ మంచి ఉదాహరణ. నిర్మాత నమ్మి డబ్బులు పెట్టాలంటే మీ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ కలగాలి. ఈ సినిమా దర్శకుడు రితేష్‌రానా సొంతగా టీమ్ అంతా ఫామ్ చేసుకుని, నిర్మాతకు నమ్మకం కలిగించి ఈ చిత్ర దర్శకత్వ అవకాశాన్ని సంపాందించాడు. రితేష్ ఐడియా నాకు బాగా నచ్చిందిఅన్నారు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం మత్తు వదలరా. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందిస్తున్నారు. ఈ నెల 25న చిత్రం ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ మా కుటుంబానికి చెందిన ఇద్దరు ఈ చిత్రంతో పరిచయ కావడం ఎంతో ఎమోషన్‌గా వుంది.