పెళ్ళిసందడి సినిమాలోని ” మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ” పాట ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. వేటూరి రచన, కీరవాణి సంగీతంలో చిత్ర పాడగా అప్పట్లో రాఘవేంద్ర రావు అద్భుతంగా తెరకెక్కించారు. అప్పటి హీరోయిన్ రవళి అందంతో పాటు తన అభినయాన్ని కూడా అద్భుతంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఇదే పాటను మళ్ళీ వర్ధమాన నటి రేఖా భోజ్ రీ-క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఈ కవర్ సాంగ్ ని రాఘవేంద్ర రావు చేతుల మీదుగానే లాంఛ్ చేయగా యూట్యూబ్ లో విడుదల అయ్యింది. ఆ పాత పాట ఫ్లేవర్ ఎక్కడా పోకుండా చాలా అందంగా చిత్రీకరించిన ఈ పాటలో నటి రేఖా భోజ్ అభినయం, అందం హైలైట్ గా నిలిచాయని నెటిజన్స్ అంటున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం. మీరూ ఓ లుక్కేయండి మరి
—
Kumar Swamy PRO [Boxoffice]
kumarswamyswamypro@gmail.com