చదలవాడ బ్రదర్స్ సమర్పణలో విడుదలకు సిద్ధమైన మా నాన్న నక్సలైట్

353

చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్ పతాకం పై పీ. సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడిగా చదలవాడ శ్రీనివాస్ నిర్మించిన “మా నాన్న నక్సలైట్” సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. తొంభై వ దశకంలో ని సామాజిక పరిస్థితుల నేపథ్యం లో సాగే ఈ కథ. లో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడైన రఘు కుంచే కొండరుద్ర సీతారామయ్య పాత్రను పోషించారు. నటుడు అజయ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అలాగే సుబ్బరాజు రాజకీయ నాయకుడు పాత్రలో నటించగా . జర్నలిస్ట్ సూర్య ప్రకాష్ రావు పాత్రలో ఎల్ బి శ్రీరామ్ నటించారు. యువ జంటగా కృష్ణ బూరుగుల , రేఖ నిరోషా నటించిన ఈ చిత్రానికి సంగీతం అందించింది ప్రవీణ్ ఇమ్మడి.

చిత్ర విశేషాలు తెలియజేస్తూ , మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ఆడియన్స్ కూడా అలరించే అన్ని హంగులతో చిత్రం రూపుదిద్దుకుందని, నటీనటుల అభినయం, సాంకేతిక నిపుణుల పనితనంతో చిత్రం హృద్యంగా తెరకెక్కిందని, తండ్రి కొడుకుల సెంటిమెంట్ ప్రతి ఒక్క ప్రేక్షకుని మనసు తాకుతుందని, త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకుందని చిత్ర నిర్మాత శ్రీనివాస రావు తెలియచేసారు.

దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి, ఇది నక్సల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే తండ్రి కొడుకుల కథ అని , రఘు కుంచే ఒక నక్సల్ నాయకుడిగా కొడుకు కోసం పరితపించే ఒక తండ్రి గా చాలా సహజంగా నటించారని . సినిమా చాలా బాగా వచ్చిందని , ఈ చిత్రంలో తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో చుపించామని , ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ నేతృత్వం లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు బాగా కుదిరాయని అయన కూడా ఒక కీలక పాత్రలో నటించారని , తెలిపారు.

బ్యానర్ : అనురాధ ఫిలిమ్స్ డివిజన్

చిత్రం పేరు : మా నాన్న నక్సలైట్

నటి నటులు : రఘు కుంచే, అజయ్, సుబ్బ రాజు , ఎల్ బి శ్రీరామ్, జీవ, కృష్ణ బూరుగుల, రేఖ నిరోషా, వినయ్ మహాదేవ్, అనిల్, ఎఫ్ ఎమ్ బాబాయ్, సముద్రం వెంకటేష్, బుగత సత్యనారాయణ , అంకోజీ రావు , కాశి విశ్వనాథ్, కనకా రావు, ప్రసన్న కుమార్, పద్మజ లంక, డ్రాగన్ ప్రకాష్ మాస్టర్, తదితరులు

సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి

లిరిక్స్ : యక్కలి రవీంద్ర బాబు, గమన్ శ్రీ, పెద్దాడ మూర్తి,

కెమెరా : ఎస్ వి శివ రామ్

ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్

రచన, దర్శకత్వం : పి. సునీల్ కుమార్ రెడ్డి

నిర్మాత : చదలవాడ శ్రీనివాసరావు

 

Pavan Kumar;PRO

9849128215