HomeTelugu*ఇప్పటి వరకు "మా ఇష్టం" లాంటి కథ ఎవ్వరూ తీయలేదు. దర్శకసంచలనం రామ్...

*ఇప్పటి వరకు “మా ఇష్టం” లాంటి కథ ఎవ్వరూ తీయలేదు. దర్శకసంచలనం రామ్ గోపాల్ వర్మ*

ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో పడితే ఏలా ఉంటుంది అని కొన్సెప్టు తో తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటి సారిగా ఇద్దరమ్మాయిల ” ప్రేమకధ” కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకసంచలనం రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన “మా ఇష్టం” చిత్రంలో అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు-తమిళ -హిందీ భాషల్లో ఆర్జీవి రూపొందించిన పాన్ ఇండియన్ మూవీ ఇది. మిగతా భాషల్లో “డేంజరస్ ” పేరుతో విడుదలయ్యే ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి తెలుగులో “మా ఇష్టం” అని పేరు పెట్టారు. ఏప్రిల్ 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏప్రిల్ 7 న రాంగోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా పాత్రికేయమిత్రులతో ముచ్చటించారు .

*మా ఇష్టం సినిమా గురించి ?*

ఇది ఒక క్రైమ్ డ్రామా మూవీ. ఇద్దరు అమ్మాయిలు ఒక క్రైమ్ లో ఇరుక్కుంటారు. ఆ క్రైమ్ నుండి బయటపడే క్రమంలో వీరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనేదే మా ఇష్టం. ఇందులో లెస్బియన్స్ గా లీడ్ పెయిర్ లలో నైనా గంగూలీ, అప్సర రాణి ఇద్దరు అద్భుతంగా నటించారు.

*ఇలాంటి సినిమాలు తీస్తే కాంట్రవర్సీస్ వస్తాయి కదా వాటిని మీరు ఎలా తీసుకుంటారు?*

నేను ఎలాంటి కాంట్రవర్సీస్ ను పట్టించుకోను, నేను తీసే సినిమా నాకు నచ్చినట్టుగా నా కోసమే తీసుకుంటాను.

*శివ మూవీ నుండి మీకంటూ ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇలాంటి మూవీ చేయడం వల్ల వారు డినప్పయింట్ అవుతారు కదా?*

నేను ఒక కొన్సెప్ట్ అనుకోని సినిమా తీస్తాను. నాకు నచ్చినట్టుగా వినిమా తీస్తాను . నచ్చితే చూడండి నచ్చకపోతే లేదు అంతే తప్ప ఎవ్వరినీ ఇబ్బంది పెట్టను.

*పెద్ద హీరోలతో హై బడ్జెట్ మూవీ ని మీ నుంచి ఎక్స్ పెక్ట్ చేయచ్చా*

నానుండి పెద్ద బడ్జెట్ మూవీలు వస్తాయని అస్సలు ఎక్స్ పెక్ట్ చేయద్దు. దానికి సంబంధించిన ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది ఉంటారు. అలాంటి సినిమాలు తీయడం నాకు చేతకాదు. తీయలేను

*ఇందులో బోల్డ్ కంటెంట్ ఎంతవరకు ఉంటుంది ?*

ఇందులో బోల్డ్ కంటెంట్ కంటే యాక్షన్ ఓరియెంటెడ్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇందులో నావల్టీ తక్కువగా ఉంటుంది. అయితే ప్రేక్షకులు ఈ మధ్య నావల్టీ ఎక్కువ చూస్తున్నందున పోస్టర్స్ ను చూసి దానికే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు.

*ఇతర దర్శకులు సినిమా తీయడానికి చాలా గ్యాప్ తీసుకుంటారు. మీరు ఫాస్ట్ గా తీయడానికి గల కారణం ఏంటి?*

అది డైరెక్టర్ పనితనాన్ని బట్టి ఉంటుంది.

*ఇద్దరి హీరోయిన్స్ మధ్య రొమాన్స్, యాక్షన్ తీయడానికి గల కారణమేంటి?*

ప్రపంచంలో ఇప్పటివరకు ఇద్దరి హీరోయిన్స్ లతో రొమాంటిక్ పాట షూట్ చేయడం జరగలేదు. ఇలాంటి కథ ఈ మధ్య ఎవ్వరూ తీయలేదు. హీరో,హీరోయిన్స్ మధ్య ప్రేమ అనేది కామన్ అది రెగ్యులర్ గా అందరూ తీసేదే..కానీ ఇలా తీయడం నేనే మొదటిసారి

*సోషల్ మీడియా గురించి మీ ఒపీనియన్ ఏంటి?*

సోషల్ మీడియాకు బారికేడ్స్ లేవు.90% సోషల్ మీడియా మన దగ్గర ఆలోచన రాకముందే వారు వారికి చెప్పినట్టు పెట్టేస్తున్నారు. నేను వాటిని పట్టించుకోను.

*మీ తదితర ప్రాజెక్ట్స్ ఏంటి?*

ఇప్పటి వరకు నేను అనౌన్స్ చేసిన సినిమాలన్నీ వచ్చాయి. ఇండో,చైనా మీద మార్షల్ ఆర్ట్స్ మీద ఒక సినిమా తీశాము జూన్ లో రిలీజ్ అవుతుంది , కొండ సినిమా రెడీ గా ఉంది, దహనం వెబ్ సిరీస్ ఇవి కాక ఇంకా 20 స్క్రిప్ట్స్ రెడీ గా ఉన్నాయి.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES