HomeTeluguవినూత్న చిత్రం '@లవ్' కు సెన్సార్ సభ్యుల ప్రశంసలు !

వినూత్న చిత్రం ‘@లవ్’ కు సెన్సార్ సభ్యుల ప్రశంసలు !

టిఎమ్మెస్‌, ప్రీతమ్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఎన్‌ క్రియేషన్స్‌ బేనర్స్‌ పై శ్రీ నారాయణ దర్శకత్వంలో విభిన్నమైన కథ కథనాలతో రాబోతున్న చిత్రం ‘@లవ్’. ఈ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ అవుతోంది. రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతి సుందర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు .తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా బాగుందని సెన్సార్ సభ్యులు అప్రిషియేట్ చేశారు. చక్కని ఏమోషనల్ థ్రిల్లింగ్ లవ్ స్టొరీ గా రూపొందిన ఈ సినిమా సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలు అందుకుంది. గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమ కథతో రాబోతున్న ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఈ సందర్బంగా దర్శకుడు శ్రీ నారాయణ మాట్లాడుతూ… వైవిధ్యంగా ఉండి, సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలు ఎప్పుడూ విజయాలు సాధిస్తాయి. ఇప్పుడు ‘@లవ్’ అనే సినిమా కూడా అలాంటి కోవకు చెందింది. ఈ సినిమాలో కంటెంట్ చాలా వైవిధ్యంగా ఉంది. మరో వినూత్న సినిమాగా నిలుస్తుంది. మంచి సినిమా రావడం లేదు అని బాధ పడేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్. గొప్ప కథకు ఆసక్తికరమైన కథనానికి స్టార్స్ అక్కర్లేదు అని నిరూపించే సినిమా ఇది. అందుకే, ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు అభినందించారు. రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు జర్నీఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. @లవ్ చిత్రంలో ప్రతి పాత్రకు ఒక కథ ఉంటుంది. ప్రతి ఎమోషన్ కథను నడిపిస్తుంది. tribal బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రం ఓ కొత్త అనుభూతిని పంచుతుంది అని అన్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES