‘లోకం ఎరుగని కథ” టీజర్ విడుదల

341

తండ్రీ ,కొడుకుల మధ్య జరిగే రైవల్రీ కథే “లోకం ఎరుగని కథ‘. శ్రీమతి సుజాత సమర్పణలో  క్రియేటివ్ డైరెక్టర్స్ క్లబ్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేంద్ర కుమార్, హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పూజిత హీరోయిన్. రవి కాంత్ జమి నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో గ్రాండ్ గా చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా

చిత్ర దర్శకుడు సురేంద్ర కుమార్,మాట్లాడుతూ..నిర్మాత  రవికాంత్ జమి గారికి నేను చెప్పిన కథ నచ్చడంతో మేము కొత్తవారిమైనా మమ్మల్ని నమ్మి సినిమా చేయడానికి ముందుకు వచ్చారు వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు.ఈ సినిమా విషయానికి వస్తే ఇది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే  లవ్ & మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీ. పాతకాలపు ఆచారాలతో ఉన్న తండ్రి , ప్రస్తుతం ట్రెండ్ కు తగ్గట్టు నడుచుకునే కొడుకు ల మధ్య వినూత్న స్క్రీన్ ప్లే తో జరిగే రైవల్రీ కథే ”లోకం ఎరుగని కథ”. ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో  షూట్  చేసుకున్న ఈ సినిమాకు పాటలు  చాలా బాగా వచ్చాయి.

ఈ పాటలను కాల భైరవ, సత్య యామిని వంటి ప్రముఖ సింగర్స్ పాడడం జరిగిం

ది.. ఈ పాటలు సరిగమ తెలుగు ద్వారా రిలీజ్ అవుతాయి. ఈ సినిమాకు పని చేసిన వారందరూ కొత్త వారైనా మంచి టాలెంట్ ఉంది. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది.మంచి లవ్ మరియు మెసేజ్ ఓరియెంటెడ్ తో వస్తున్న  లోకమెరుగని కథ’  సినిమాను అందరూ బ్లేస్ చేయాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకాంత్  కొప్పుల మాట్లాడుతూ..ఇంతకుముందు నేను  చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి నన్ను ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులోని పాటలు బాగా వచ్చాయి. అందరినీ ఈ సినిమాలోని పాటలు అలరిస్తాయి. ఇలాంటి మంచి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం కల్పించిన  దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు అన్నారు.

నటుడు విజయ్ విశ్వనాధన్ మాట్లాడుతూ.. తమిళం లో కొన్ని సినిమాలు చేశాను. మంచి కంటెంట్ ఉన్న తెలుగు సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

హీరోయిన్ పూజిత మాట్లాడుతూ. ఇది నా మొదటి చిత్రం. మా టీం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశాము. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక  నిర్మాతలకు  ధన్యవాదాలు అన్నారు.

కెమెరామెన్ శ్రీ ప్రసాద్ తుమ్మల మాట్లాడుతూ.. దర్శక, నిర్మాతలు మా దగ్గర నుండి మంచి అవుట్ పుట్ రాబట్టుకున్నారు. శ్రీకాంత్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా కొరకు మా అసిస్టెంట్ డైరెక్టర్ బాగా సపోర్ట్ చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు  అన్నారు.

నటీ నటులు సురేంద్ర కుమార్, పూజిత, విజయ్ విశ్వనాధ్ తదితరులు

 

సాంకేతిక నిపుణులు 

సమర్పణ : శ్రీమతి సుజాత

బ్యానర్ : క్రియేటివ్ డైరెక్టర్స్ క్లబ్ ప్రొడక్షన్స్

నిర్మాత : రవి కాంత్ జమి
దర్శకత్వం : సురేంద్ర కుమార్
కెమెరామెన్ :  శ్రీ ప్రసాద్ తుమ్మల
మ్యూజిక్ : శ్రీకాంత్  కొప్పుల
ఎడిటర్ : మ్యాడి
కో. డైరెక్టర్ : సాయి కుమార్ ముత్యాల
మాటలు : ఎస్ ఎన్ ఆర్ మరియు తరిణిక
ఆసిస్టెంట్ డైరెక్టర్స్ : సాయికుమార్ సైదు, హరి కిరణ్, శ్రీనివాస్ బాలె
ఆర్ట్ : జమీర్
పి. ఆర్. ఓ : పవన్ పాల్