లింగోచ్చా” చిత్రం నుంచి 2వ పాట “నూర్జ” ను విడుద‌ల చేసిన సుప్రీమ్ హీరో సాయితేజ్

492


కార్తీక్ రత్నం సూప్యార్ధే సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీకళ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం “లింగోచ్చా”. ఆకర్షణీయమైన టీజర్, మరియు మొదటి పాటతో ఇప్పటికే ఆకట్టుకున్న ఈ సినిమాలోని 2 వ పాట “నూర్జ” “సుప్రీం హీరో” సాయి తేజ్ ఈరోజు విడుదల చేశారు. నిర్మాణాంతర కార్యక్రమాలు ముగించుకున్న ఈ ప్రేమకధా చిత్రం విడుదలకి సిద్ధమైంది. మొదటి పాటకి విశేషమైన స్పందన రావడంతో ఈ రోజు విడుదలైన రెండవ పాట ‘నూర్జ’ కూడా శ్రోతల్ని ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటకి రచన ఉదయ్ మదినేని, సంగీతం మరియు గానం బికాజ్ రాజ్, కొరియోగ్రఫీ భాను, మాటలు ఉదయ్ మదినేని, రచన – దర్శకత్వం ఆనంద్ బడా, నిర్మాత యాదగిరి రాజు

నటీన‌ట‌లు

కార్తీక్ ర‌త్నమ్, సుప్యార్దే సింగ్, బెబీ ఫిదా మొగ‌ల్, మాస్ట‌ర్ ప్రేమ్ సుమ‌న్, ఉత్తేజ్, తాగుబోతు ర‌మేశ్, కునాల్ కౌశిక్‌, బ‌ల్వీర్ సింగ్ ,స‌ద్దామ్ హుస్సెన్‌, మిమిక్రి మూర్తి, ధీర్ చ‌ర‌ణ్ శ్రీవాస్త‌వ్‌(ఇస్మాయిల్ భాయ్), ఫిష్ వెంక‌ట్‌, రవి శంకర్, శోభారాణి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం

బ్యాన‌ర్ – శ్రీక‌ళ‌ ఎంటర్టైన్మెంట్స్
స‌మ‌ర్ప‌ణ – బ్లాక్ బాక్స్ స్టూడియోస్
నిర్మాత – యాద‌గిరి రాజు
రచన, ద‌ర్శ‌క‌త్వం – ఆనంద్ బ‌డా
మాట‌లు – ఉద‌య్ మ‌దినేని
కెమెరా – రాకేశ్
ఎక్సీక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – మ‌ల్లేశ్ క‌న్జ‌ర్ల‌
లైన్ ప్రొడ్యూస‌ర్స్ – సందీప్ తుమ్కుర్, శ్రీనాధ్ చౌద‌రి
ప‌బ్లిసిటి డిజైన‌ర్ ‌- శ్రావ‌ణ్ మెంగ‌
పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌ – ఏ వెంక‌టేశ్వ‌రావు
కొరియోగ్ర‌ఫి – భాను
మ్యూజిక్ – బికాజ్ రాజ్
ఎడిటింగ్ – మ్యాడీ, శ‌శిబ‌డా
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ – బాబీ గంధం
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

Eluru Sreenu
P.R.O