HomeTeluguలెహరాయి సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను - కార్తికేయ

లెహరాయి సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను – కార్తికేయ

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లెహరాయి.డిసెంబర్ 9న లెహరాయి సినిమా విడుదలకానుంది.ఇందులో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది ఈ చిత్ర బృందం.

హీరో కార్తికేయ మాట్లాడుతూ
అందరికి నమస్కారం, ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి మూవీ ను సపోర్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. కొత్త సినిమా హిట్ ఎంత హిట్ అయితే అంతమంది కొత్తవాళ్లు వస్తారు. ఎంతమంది కొత్తవాళ్లు వస్తే ఇండిస్ట్రీ అంత బాగుంటుంది.సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలిపారు. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

హీరో రంజిత్ మాట్లాడుతూ
వేణుగోపాల్ గారికి చాలా థాంక్యూ. ఈ సినిమాకు ఫస్ట్ ఆడియన్ ఆయనే. ఈ రోజు నాకు 100 కోట్లు లాటరీ గెలిచినంత ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి కథ, ఇది పూరి జగన్నాధ్ తీసిన, త్రివిక్రమ్ తీసిన అందరికి నచ్చుతుంది. అంత అద్భుతమైన కథ ఇది. ఈ సినిమా స్టార్ట్ ఐనప్పటినుండి మంచి పాజిటివ్ వైబ్ ఉంది. మా మూవీ ప్రోమోట్ చెయ్యడానికి వచ్చిన కార్తికేయ గారికి చాలా థాంక్యూ. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది.డిసెంబర్ 9న థియేటర్ కి వచ్చి సినిమా చూస్తారని ఆశిస్తున్నా.

దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ
ముందుగా మీడియాకు కృతజ్ఞతలు.ఇక్కడికి వచ్చిన అతిధులు అందరికి కృతజ్ఞతలు.ఈ రోజు హీరో మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ గారు ఈ సినిమాలో ఆరు పాటలు మంచి హిట్ అయ్యాయి. ఈ సినిమాకి హీరో మద్దిరెడ్డి శ్రీనివాస్ గారు, ఆయనే మా దేవుడు మద్దిరెడ్డి శ్రీనివాస్ గారు మాకంటే ఎక్కువగా సినిమాపై మంచి ఇంట్రస్ట్ చూపించారు అంటూ, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు. డిశంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ
ఇక్కడికి వచ్చిన మీడియాకు కృతజ్ఞతలు. ఈ సినిమాను నా మిత్రుడు కుమారస్వామి ప్రారంభించారు. ఇదివరకు ఆయన తీసిన సినిమాలకు నేను భాగస్వామిగా ఉన్నాను. కరోనా మహమ్మరి కారణంగా ఆయన చనిపోయాక ఈ సినిమాను పట్టుబట్టి ఈ స్థాయికి తీసుకొచ్చాను. ఈ సినిమాను కథాపరంగా, పాటల పరంగా మా టీం అంతా ఎంతో కష్టపడ్డారు.
సినిమాకు కావాల్సిన అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 9న రిలీజ్ చేస్తున్నాం.ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ సినిమాను చాలా మందికి చూపించాను. అందరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఈ సినిమాకు పి.ఆర్.ఓ ఏలూరు శ్రీను మంచి సపోర్ట్ చేసారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కృతజ్ఞతలు.

నటీనటులు:

రంజిత్, సౌమ్య మీనన్, గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ, సత్యం రాజేష్, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు.

సాంకేతిక బృందం:

సమర్పకుడు: బెక్కం వేణుగోపాల్
బ్యానర్: S.L.S. సినిమాలు
చిత్రం: “లెహరాయి”
నిర్మాత: మద్దిరెడ్డి శ్రీనివాస్
రచయిత, దర్శకుడు: రామకృష్ణ పరమహంస
సంగీతం: GK (ఘంటాడి కృష్ణ)
D.O.P.: MN బాల్ రెడ్డి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
గేయ రచయితలు: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, ఉమా మహేష్, పాండు తన్నీరు
ఫైట్ మాస్టర్: శంకర్
కొరియోగ్రాఫర్‌లు: అజయ్ సాయి
రచయిత: పరుచూరి నరేష్
పి.ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్\

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES