మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కు లేటెస్ట్ టెక్నాలజీతో ది బెస్ట్ క్వాలిటీ ఇచ్చేందుకు హైదరాబాద్ మణికొండ పంచవటి కాలనీలో పిక్సెల్స్ అండ్ స్ట్రింగ్స్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో ఏర్పాటైంది. యంగ్ ప్యాషనేట్ పర్సన్స్ తరుణ్, భరత్ ఈ స్టూడియోను ఏర్పాటు చేశారు. ఈ రోజు పిక్సెల్స్ అండ్ స్ట్రింగ్స్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, నిర్మాతలు అశ్వనీదత్, దిల్ రాజు, దర్శకుడు బలగం వేణు, స్వర్గీయ కృష్ణంరాజు సతీమణి శ్రీమతి శ్యామలాదేవి, మణికొండ మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్, టీడీపీ నాయకులు టీడీ జనార్థన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా
శ్రీమతి శ్యామలాదేవి మాట్లాడుతూ – పిక్సెల్స్ అండ్ స్ట్రింగ్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. చాలా మంచి టెక్నాలజీతో తరుణ్, భరత్ ఈ స్టూడియోను నిర్మించారు. ఈ యంగ్ టీమ్ సక్సెస్ కావాలి. కృష్ణంరాజు గారు కూడా కొత్తవాళ్లు పరిశ్రమకు వచ్చి ఎదిగితే సంతోషించేవారు. మేము కూడా ప్రొడక్షన్ లో ఉన్నాం కాబట్టి పిక్సెల్స్ అండ్ స్ట్రింగ్స్ వంటి మంచి స్టూడియోస్ మాకూ అవసరం. తరుణ్, భరత్ కు నా బెస్ట్ విశెస్ తెలియజేస్తున్నా. అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – తరుణ్, భరత్ తమ యంగ్ టీమ్ తో పిక్సెల్స్ అండ్ స్ట్రింగ్స్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోను మణికొండ పంచవటి కాలనీలో ఏర్పాటు చేశారు. ఈ స్టూడియో విశేషం ఏంటంటే అంతా యంగ్ బ్యాచ్ ఉన్నారు. అన్ని రకాల పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవచ్చు. ఇలాంటి స్టూడియోలు సినిమా ఇండస్ట్రీకి చాలా ఉపయోగకరం. పిక్సెల్స్ అండ్ స్ట్రింగ్స్ స్టూడియో బాగా సక్సెస్ కావాలి. ఆల్ ది బెస్ట్. అన్నారు.
పిక్సెల్స్ అండ్ స్ట్రింగ్స్ స్టూడియో ఫౌండర్ భరత్ మాట్లాడుతూ – మా స్టూడియోలో లేటెస్ట్ టెక్నాలజీతో మంచి క్వాలిటీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అందించబోతున్నాం. మా స్టూడియోలో డబ్బింగ్, మిక్సింగ్, 5.1, 7.1, డీఐ, డాల్బీ మిక్సింగ్ ..వంటి సర్వీసెస్ హై క్వాలిటీ టెక్నాలజీతో అందిస్తాం. మా స్టూడియోలో యంగ్ ప్యాషనేట్ ఇంజినీర్స్, కలరిస్ట్స్, మిక్సింగ్ ఇంజినీర్స్ వర్క్స్ చేస్తున్నారు. అన్ని మూవీస్ కు క్వాలిటీ పోస్ట్ ప్రొడక్షన్ అవసరం అయితే చిన్న చిత్రాలకు ఈ క్వాలిటీ ఎక్కువగా అందడం లేదు. అందుకే మేము మెయిన్ గా చిన్న చిత్రాలకు బెస్ట్ క్వాలిటీ పోస్ట్ ప్రొడక్షన్ ఇవ్వాలని భావిస్తున్నాం. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.
పిక్సెల్స్ అండ్ స్ట్రింగ్స్ స్టూడియో ఫౌండర్ తరుణ్ మాట్లాడుతూ – మా స్టూడియోలో లేటెస్ట్ టెక్నాలజీతో మంచి క్వాలిటీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అందించబోతున్నాం. మా స్టూడియోలో డబ్బింగ్, మిక్సింగ్, 5.1, 7.1, డీఐ, డాల్బీ మిక్సింగ్, మాస్టరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్స్ ..వంటి సర్వీసెస్ హై క్వాలిటీ టెక్నాలజీతో అందిస్తాం. వీలైనంత తక్కువ సమయంలో ది బెస్ట్ క్వాలిటీ ఔట్ పుట్ ఇవ్వాలనే లక్ష్యంతో మా టీమ్ అంతా పనిచేస్తున్నాం. అన్నారు.