నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం లక్ష్య. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా హీరో నాగశౌర్య మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు…
వరుడు కావలెను సినిమా నా పరిధికి సంబంధించినది. అలాంటి సబ్జెక్ట్ ఎన్ని సార్లు చేసినా సక్సెస్ అవుతుందన్న నమ్మకం దర్శక నిర్మాతలకు ఉంది. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇప్పుడు లక్ష్య సినిమా రాబోతోంది. లక్ష్య ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను.
కథ విన్న వెంటనే నా వైపు నుంచి వంద శాతమివ్వాలని అనుకున్నాను. కొత్త నాగ శౌర్యను చూపించాలని అనుకున్నాను. ఇలాంటి కథలు రావడమే అదృష్టం. ఇలాంటివి వచ్చినప్పుడు యాక్టర్స్ ఎవ్వరైనా ఓ అడుగు ముందుకు వేస్తారు. నేను కూడా అదే చేశాను.
ముందు ఏసియన్ సునీల్ గారు ఫోన్ చేశారు. ఓ కథ ఉంది వెంటనే వినాలని అన్నారు. సంతోష్ గారు వచ్చి దాదాపు నాలుగు గంటల పాటు ఫస్ట్ హాఫ్‌ను నెరేట్ చేశారు. ప్రతీది విడమరిచి చెప్పారు. బాణం ఎలా పట్టుకోవాలి.. ఎలా నిల్చోవాలి అంటూ ఇలా అన్నీ వివరించి చెప్పారు. కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను.
ఆర్చరీ మనకు తెలియంది కాదు. పురాణాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం.. మన వీరుల చేతుల్లో విల్లు ఉంటుంది. ఈ రోజు విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్లోనూ రామ్ చరణ్ గారు బాణంతో కనిపించారు. అన్నింటిని ఆటలు అని అంటాం కానీ ఒక్క ఆర్చరీని మాత్రమే విలు విద్య అని అంటాం. దాన్ని మనం ఎడ్యుకేషన్‌గా గౌరవిస్తాం. మన వాళ్లు దాన్ని మరిచిపోయారు. కాస్త గుర్తు చేద్దామని ఈ సినిమా తీశాం.
ఏ ఆట అయినా సరే ప్రొఫెషనల్‌గా వెళ్లాలంటే చాలా కష్టం. కానీ ఈ సినిమా కోసం ఆర్చరీని నేర్చుకున్నాను. 35 కేజీలను వెనక్కి లాగడం మామూలు విషయం కాదు. ఎన్నో గాయాలు కూడా అవుతుంటాయి. ఈ సినిమా కోసం మూడు రోజులు మాత్రమే శిక్షణ తీసుకున్నాను. చదువు తప్ప నాకు అన్నీ తొందరగా వస్తాయి(నవ్వులు)
కొత్త దనం చూపించేందుకే ఈ సినిమాను చేశాం. సై సినిమానే మాకు స్ఫూర్తి. ఎవ్వరికీ తెలియని ఆటను తీసుకొచ్చి కమర్షియల్‌గా జోడించి అద్బుతంగా చూపించారు. నెరేషన్ బాగుంటే సినిమా అద్బుతంగా వస్తుంది. అందులో సంతోష్ సక్సెస్ అవుతాడని నమ్మకం ఉంది.
దేశంలోనే ఆర్చరీ నేపథ్యంలో రాబోతోన్న మొదటి సినిమా లక్ష్య. నా కెరీర్లోనూ స్పోర్ట్స్ బేస్డ్ సినిమాను చేయడం ఇదే మొదటి సారి. ఇది వరకు కూడా క్రీడా నేపథ్యంలోని కథలు నా వద్దకు వచ్చాయి. కానీ ఇది బాగా నచ్చింది.
అందరికీ కూడా తామెంటో ప్రపంచానికి నిరూపించాలని అనుకుంటారు. అలానే పార్థు కూడా ప్రపంచానికి తానేంటో చూపించే ముందు తనలోని చెడుని ఎలా గెలిచాడు.. చివరకు ప్రపంచాన్ని ఎలా గెలిచాడు అనేది లక్ష్య థీమ్.
సచిన్ ఖేడేకర్, జగపతి బాబు, కేతిక శర్మల ఇదే నా మొదటి సినిమా. అల వైకుంఠపురములో సినిమా అయిన వెంటనే మా సెట్లో జాయిన్ అయ్యారు. కానీ ఆయన ఏనాడూ కూడా కేరవ్యాన్‌లోకి వెళ్లలేదు. మాతో పాటు కూర్చుని సినిమా గురించి చర్చించేవారు. నేను బాగా నటించకపోతే వారి ముందు అంతగా కనిపించనేమోనని పోటాపోటీగా నటించేశాను.
లవ్ స్టోరీ అంటే చివరకు హీరోహీరోయిన్లు కలుస్తారు.. కమర్షియల్ సినిమాలో విలన్‌ను హీరో చంపుతాడు. కానీ హీరో హీరోయిన్లు ఎలా కలుస్తారు.. విలన్‌ను ఎలా చంపేస్తారు అనేది ముఖ్యం. ఈ చిత్రంలో కూడా అదే ఇంపార్టెన్స్. ఇప్పుడు ప్రతీ ఒక్క హీరో బాడీని ఫిట్‌గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్థు మారాడు అని చెప్పడానికి అలా బాడీలో మార్పులు చూపించాను. ఒక్కసారి అనుకుంటే ఏ యాక్టర్ అయినా సిక్స్ ప్యాక్ చేస్తారు. కరెక్ట్ స్క్రిప్ట్ పడితే అందరం చాలా కష్టపడతాం. ఈ సినిమా కోసం దాదాపు తొమ్మిది రోజులు కనీసం నీళ్లు కూడా ముట్టుకోలేదు.
ఈ సినిమాకు ముగ్గురు నిర్మాతలు. వారి వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. ఫోటో షూట్ చేసినప్పుడు భయంకరంగా కరోనా ఉంది. అయినా నా కోసం రూం అంతా కూడా రెండు రోజులు శానిటైజ్ చేసి పెట్టారు. ఎక్కువ మంది లేకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శకుడు, హీరోకు నచ్చినట్టు సినిమా తీయడానికి స్వేచ్చను ఇచ్చారు.
కేతిక శర్మ రొమాంటిక్ సినిమాతో బాగా అందరికీ రీచ్ అయ్యారు. ఊహలు గుసగుసలాడే సినిమా నాకు చాలా కాలం గుర్తుండిపోయింది. కేతిక శర్మకు రొమాంటిక్ సినిమా అలా గుర్తుండిపోతుంది. కేతిక శర్మ చాలా అందంగా ఉంటుంది. చక్కగా నటించింది.
వరుడు కావలెను సినిమా తరువాత సంబంధాలేవీ రాలేదు. గత లాక్‌డౌన్‌లోనే పెళ్లి పెళ్లి అంటూ ఇంట్లో చంపేశారు. ఇంకోసారి లాక్డౌన్ వస్తే పెళ్లి చేసుకుంటాను. అలా అని లాక్డౌన్ రావాలని కోరుకోవడం లేదు (నవ్వులు).
ఐరా ప్రొడక్షన్స్ నెంబర్ 4లో ఓ సినిమాను చేస్తున్నాను. ఇందులో బ్రాహ్మిణ్ కారెక్టర్‌ను పోషిస్తున్నాను. నాకు చాలా నచ్చిన కథ. పలానా అమ్మాయి పలానా అబ్బాయి నాకు ఎంతో దగ్గరైన సినిమా. నటుడిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఇందులో ఏడు రకాల వేరియేషన్స్ ఉంటాయి. ఈ సినిమాను నా ముందు జనరేషన్స్‌కి, నా కుటుంబానికి చూపించుకునే మంచి సినిమా అవుతుంది. బాలయ్య గారితో సినిమా అనేది కేవలం రూమర్. ఏసియన్ నా హోం బ్యానర్. ఎన్ని సినిమాలైనా చేయొచ్చు.
Pro: Vamsi – Shekar
9581799555 – 9553955385