HomeTeluguబ్రహ్మాండమైన కథ-కథనాలతో ఓ రేంజ్ ప్రొడక్షన్స్ "బ్రహ్మ రాసిన కథ"

బ్రహ్మాండమైన కథ-కథనాలతో ఓ రేంజ్ ప్రొడక్షన్స్ “బ్రహ్మ రాసిన కథ”

తెలుగు సినిమా రంగంలో మహిళా నిర్మాతల ప్రాతినిధ్యం ఇప్పటికీ తక్కువగానే ఉంది. ఆ లోటును ఎంతోకొంత భర్తీ చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటున్నారు డైనమిక్ లేడి “సింధు నాయుడు”. ఓ రేంజ్ ప్రొడక్షన్స్ పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పిన సింధు నాయుడు… తొలి ప్రయత్నంగా “బ్రహ్మ రాసిన కథ” అనే ఇండిపెండెంట్ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ సంకు దర్శకత్వంలో లారెన్స్ నరేష్-శ్రీలయ జంటగా రూపొందిన ఈ చిత్రం.. ప్రేమలోని ఓ సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని డైనమిక్ లేడి ప్రొడ్యూసర్ సింధు నాయుడు చెబుతున్నారు.
సాక్షాత్తూ సరస్వతీదేవి సిఫార్సుతో బ్రహ్మదేవుడి నుంచి ఓ వినూత్నమైన వరం పొందిన ఓ యువకుడి ప్రేమకథలో చోటుచేసుకునే చిత్రవిచిత్రమైన ట్విస్టుల సమాహారంగా రూపొందిన “బ్రహ్మ రాసిన కథ” చిత్రాన్ని తమ దర్శకుడు నవీన్ సంకు అద్భుతంగా తెరకెక్కించాడని, దర్శకుడిగా అతనికి ఉజ్వల భవిష్యత్ ఉందని సింధు నాయుడు పేర్కొన్నారు. హీరోహీరోయిన్లు లారెన్స్ నరేష్-శ్రీలయలకు కూడా చాలా మంచి పేరు వస్తుందని, ఇద్దరూ పోటాపోటీగా నటించారని ఆమె అన్నారు.
వంశీ, కల్యాణి, భార్గవ్ నాయక్, రితిక దేశ్ ముఖ్, లక్షిత, సుధీర్ కె.వంశీ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పాటలు: భువనేశ్వర్ రాగఫణి, సంగీతం: సన్నీ సకురు, ఎడిటింగ్ & డిఐ: జగ సి.హెచ్, బ్యానర్: ఓ రేంజ్ ప్రొడక్షన్స్, నిర్మాత: సింధునాయుడు, రచన-దర్శకత్వం: నవీన్ సంకు!!

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES