“కురుక్‌క్షేత్రం” ఆడియె & ట్రైల‌ర్ లాంచ్‌

530

మ‌హాభార‌తం లాంటి అత్య‌ద్బ‌త దృశ్య‌ కావ్యాన్ని తొలిసారిగా ఇండియ‌న్ స్క్రీన్‌మీద 3డిలో చూడ‌బోతున్నాం. ఈ చిత్రంలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ క‌ర్ణుడుగా ద‌ర్శ‌న్ దుర్యోధ‌నుడిగా, సోనూసూద్ అర్జునుడిగా, అభిమ‌న్యుడిగా అఖిల్‌గౌడ్‌, కృష్ణుడిగా ర‌విచంద్ర‌న్ న‌టించ‌గా ద్రౌప‌దిగా స్నేహ న‌టించారు. ఈ చిత్రం ఒకేసారి ఐదుభాష‌ల్లో విడుద‌ల‌వ్వ‌డం విశేషం. మెట్ట‌మెద‌టి సారిగా ప్ర‌పంచం లోనే మైత‌టాజిక‌ల్ 3డి వెర్ష‌న్ గా ఈచిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రానికి తెలుగు, క‌న్న‌డ బాష‌ల్లో ఎన్నో చిత్రాలు నిర్మించి సౌత్ ఇండియా సన్సెష‌న‌ల్ ప్రోడ్యూస‌ర్ గా పేరుగాంచిన రాక్‌లైన్‌ వెంక‌టేష్‌గారు ఈ చిత్రాన్ని స‌మ‌ర్ప‌ణ‌లో, వృష‌భాద్రి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకం పై సినిమా పై ఫ్యాఫ‌న్ తో త‌న ప్రోఫెష‌న్ గా తీసుకుని ఎన్నోచిత్రాలు క‌న్న‌డ‌లో నిర్మించిన మునిర‌త్న (ఎంఎల్ఎ) ఈ చిత్రాన్ని నిర్మించమే కాకుండా ఈ చిత్ర క‌థ‌ని అందించారు. నాగ‌న్న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైల‌ర్, ఆడియో లాంచ్‌ బుధ‌వారం ప్ర‌ముఖ నిర్మాత‌లు బివిఎస్ఎన్ ప్ర‌సాద్‌, బ‌న్నీవాసుల చేతుల మీదుగా హైద‌రాబాద్ లో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో…
డైరెక్ట‌ర్ నాగ‌న్న మాట్లాడుతూ… ఈ చిత్రంలో ద‌ర్శ‌న్ దుర్యోధ‌న పాత్ర పోషించారు. నిర్మాత మునిర‌త్న‌గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా చాలా బాగా తీశారు. మ‌న భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టిసారిగా మైథ‌లాజిక‌ల్ ఫిల్మ్ ని 3డిలో సినిమా చేసిన క్రెడిట్ ఆయ‌న‌కే ద‌క్కుతుంది. కురుక్షేత్రం చిత్రం అంటేనే పండ‌గ‌లా ఉంటుంది. మీ అంద‌రి స‌పోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి అని అన్నారు.
చిత్ర స‌మ‌ర్ప‌కుడు రాక్‌లైన్ వెంక‌టేష్ మాట్లాడుతూ.. ఇలాంటి ఒ గొప్ప చిత్రాన్ని మునిరత్నం గారు నిర్మించ‌టం నేను స‌మ‌ర్ప‌కుడిగా వుండ‌టం చాలా ఆనందంగా వుంది. ఈచిత్రాన్ని తెలుగులొ విడుద‌ల చేయ‌టానికి స‌హ‌క‌రించిన అంద‌రికి నా ప్ర‌త్య‌ఖ ద‌న్య‌వాధాలు. ఈ చిత్రం లో న‌టించాన అర్జున్ గారు, మా ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శ‌న్ గారు, సొనూసూద్ గారు , ర‌విచంద్ర‌న్ గారు, స్నేహ గారు ఇలా చాలా మంది పెద్ద ఆర్టిస్టులు న‌టించారు. ఈ చిత్రాన్ని ఎక‌కాలం లో ఐదు భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాము అని అన్నారు