అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆహ్లాదకర చిత్రం’క్షీర సాగర మథనం’

632

అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆహ్లాదకర చిత్రం ‘క్షీర సాగర మథనం’. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్నఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్, హీరోలుగా నటిస్తున్నారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. ప్రముఖ యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేయగా- బహుముఖ ప్రతిభాశాలి అడివి శేష్ ‘క్షీరసాగరమథనం’ పోస్టర్ ను లాంచ్ చేశారు. చిత్ర కథానాయకి అక్షత సోనావని ఫస్ట్ లుక్ సంచలన కథానాయకి పాయల్ రాజ్ పుట్ విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న ‘ప్రియాంత్’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. ‘క్షీర సాగర మథనం’ చిత్రాన్ని ఐదు విభిన్న కథల సమాహారంగా రూపొందిస్తున్నాము. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. కొత్త తరహా చిత్రాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుండే మన ప్రేక్షకులు.. “క్షీర సాగర మథనం” చిత్రాన్ని హృదయాలకు హత్తుకుంటారనే నమ్మకం ఉంది” అన్నారు.
చరిష్మా శ్రీకర్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి!!