HomeTeluguరంగమార్తాండ ప్రతిఒక్కరు తమ తల్లిదండ్రులతో చూడాల్సిన సినిమా: కృష్ణవంశీ

రంగమార్తాండ ప్రతిఒక్కరు తమ తల్లిదండ్రులతో చూడాల్సిన సినిమా: కృష్ణవంశీ


హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఇళయరాజా సంగీతం సారధ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రంగమార్తాండ.

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రలు పోషిస్తున్న “రంగమార్తాండ” చిత్ర లిరికల్స్ సాంగ్స్ తో ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటుంది, మరాఠీ సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామా ‘నట్ సామ్రాట్’ కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఉగాది సందర్భంగా మార్చి 22న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ సింగర్, నటుడు రాహుల్ సిప్లిగంజ్ మీడియా సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా దర్శకులు కృష్ణవంశీ మాట్లాడుతూ
రంగమార్తాండ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాను చూసిన అందరూ పాజిటీవ్ గా మాట్లాడుతున్నారు. సినిమా విడుదల తరువాత ప్రేక్షకులకు కూడా సినిమా బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాకు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ నటన ఇళయరాజా సంగీతం, సీతారామశాస్త్రి గారి సాహిత్యం ఇలా సినిమాకు అన్ని కుదిరాయి. ఈ సినిమను చూసిన ఒక చిన్నారి “నేను మా అమ్మా నాన్నలను బాగా చూసుకుంటాను” అని చెప్పడం విశేషం. ఇలా సినిమా చూసిన అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. ప్రతిఒక్కరు తమ తల్లి తండ్రులతో ఈ సినిమాను చూడాలని కోరారు.

రంగమార్తాండ చిత్రం చివర్లో రమ్య మీద సన్నివేశాలు షూట్ చేసేటప్పుడు చాలా బాధ పడ్డాను. నిజానికి రమ్యకృష్ణ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాను. రమ్య కళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. దీంతో ఎలాంటి పెద్ద డైలాగులు లేకుండా కళ్లతోనే నటించాలని రమ్యకు చెప్పినప్పుడు సరేనని చెప్పింది. ఈ పాత్ర కోసం మేకప్, హెయిర్ స్టైల్ కూడా తనే చేసుకుంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌లో తన మీద సన్నివేశాలు చిత్రీకరించడానికి చచ్చిపోయాను. దాదాపు 36 గంటల పాటు ఈ సీన్స్ తీశాను. అప్పుడు నాకు సెంటిమెంట్ అడ్డొచ్చింది. షూట్ చేస్తుంటే కంట్లో నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయని తెలిపారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES