యోగాలో గిన్నిస్ రికార్డ్:

489


[ ] చైనాలో అనకాపల్లి వాసి ఘనత
[ ] 2.32 నిమిషాల పాటు
అష్టవక్రాసనం వేసిన కొణతాల విజయ్

అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లిలో పుట్టి చైనాలో యోగా గురువుగా ప్రఖ్యాతి గాంచిన కొణతాల విజయ్ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు. చైనాలోని జెంజూ నగరంలో ఆగష్ట్ 4న అష్టవక్రాసనాన్ని 2.32 నిమిషాలపాటు ప్రదర్శించి ఈ ఘనత సాధించారు. విజయ్ చదువుకునే సమయంలోనే యోగా నేర్చుకున్నారు. తర్వాత నృత్యంలో మెలకువలు సంపాదించి స్టార్ డాన్సర్ గా గుర్తింపు పొందారు. పలు దేశాల్లో డాన్స్ శిక్షకుడిగా పనిచేసిన ఆయన చైనాలో స్థిరపడి నృత్యం, యోగ విధ్యలో శిక్షణ ఇస్తున్నారు.

భార్యాభర్తలిద్దరికీ గిన్నిస్ బుక్ లో స్థానం: విజయ్ భార్య జ్యోతి కొద్ది నెలల క్రితం గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్నారు. నిండు గర్భంతో యోగాసనాలు వేసి ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పారు.