తిృగున్, పూజిత పొన్నాడ జంటగా యమ్.పి. ఆర్ట్స్ పతాకంపై చాణిక్య చిన్న దర్శకత్వంలో మోనిష్ పత్తిపాటి నిర్మించిన సినిమా ‘కథ కంచికి మనం ఇంటికి’. ఏప్రిల్ 8న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా పూజితా పొన్నాడ మీడియాతో మాట్లాడారు. ‘కథ కంచికి మనం ఇంటికి’ సినిమాతో పాటు ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల గురించి ఇంటర్వ్యూ…
పూజితా పొన్నాడ మాట్లాడుతూ “ఈ ఏడాది విడుదలవుతున్న నా తొలి సినిమా ‘కథ కంచికి మనం ఇంటికి’. హారర్ నేపథ్యంలో రూపొందిన కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో నా క్యారెక్టర్ విషయానికి వస్తే… దీక్ష పాత్ర చేశా. తనకు బెట్టింగ్ అంటే ఇష్టం. ప్రతిసారీ బెట్ గెలుస్తుంది. ఆ డబ్బును ఛారిటీ చేస్తుంది. బెగ్గర్స్ కోసం ఇస్తుంది. ఇటువంటి పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా, ఆసక్తికరంగా అనిపించింది. రచయితగా ‘మిర్చి’ హేమంత్, దొంగగా ‘గెటప్’ శీను చేశారు. హీరో హీరోయిన్లతో పాటు వీళ్ళ పాత్రలు కూడా సినిమాలో కీలకం. ఫస్టాఫ్ అంతా సరదాగా ఉంటుంది. సెకండాఫ్ హారర్ జోనర్ లో ఉంటుంది. అక్కడ కూడా ఫన్ మిస్ అవ్వదు.
ఈ సినిమాలో నాకు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. సాధారణంగా ఎంత మంది హీరోయిన్లకు యాక్షన్ చేసే ఛాన్స్ వస్తుంది చెప్పండి? దర్శకుడు కథ వివరించినప్పుడు 40 అడుగుల ఎత్తులో మీరు యాక్షన్ చేయాలని చెప్పారు. నాకు యాక్షన్ చేయడం అంటే ఇష్టమని చెప్పాను. ఫస్ట్ ఫ్లిఫ్స్ చేసినప్పుడు నా ముఖానికి దెబ్బలు తగులుతాయేమోనని భయపడ్డా. రెండు మూడు రిహార్సిల్స్ చేసిన తర్వాత ఈజీగా చేశా. ఫైట్ మాస్టర్ దగ్గరకు వెళ్లి ఇంకా యాక్షన్ సీన్స్ పెట్టమని అడిగా. సెకండాఫ్ లో ఒక యాక్షన్ సీన్ ఆడియన్స్ కు సర్‌ప్రైజ్ ఇస్తుంది” అని చెప్పారు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి చెబుతూ… “తెలుగులో రవితేజ గారితో ‘రావణాసుర’, పవన్ కళ్యాణ్ గారితో ‘హరిహర వీరమల్లు’, ‘ఆకాశ వీధిలో’, ‘జోరుగా హుషారుగా’, ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాలు చేస్తున్నాను. ఓటీటీ కోసం ఒక యాంథాలజీ చేస్తున్నాను. ఈ ఏడాది నేను తమిళ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నాను. ఆరితో ‘భగవాన్’, శ్రీరామ్ గారితో ‘ట్రైనర్’ సినిమాలు చేస్తున్నాను. గాళ్ నెక్స్ట్ డోర్ కాకుండా డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్స్ చేస్తున్నాను” అని చెప్పారు.
‘కథ కంచికి మనం ఇంటికి’లో నటీనటులు:
తిృగున్, పూజిత పొన్నాడ, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్ కుమార్, శ్యామల, హేమంత్ , గెటప్ శ్రీను తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ :- యమ్. పి.ఆర్ట్స్
టైటిల్ :- కథ కంచికి మనం ఇంటికి
నిర్మాత :- మోనిష్ పత్తిపాటి
దర్శకత్వం :- చాణిక్య చిన్న
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :- సుభాష్ డేవాబత్తిన
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – దత్తి సురేశ్ బాబు
లైన్ ప్రొడ్యూసర్ :- కుమార్ కోట
మ్యూజిక్ :- బీమ్స్ సిసిరోలియో
డి.ఓ.పి :- వైయస్ కృష్ణ
ఎడిటింగ్ :- ప్రవీణ్ పూడి
డైలాగ్స్ :- శ్రీనివాస్ తేజ
ఫైట్స్ :- షావోలిన్ మల్లేష్
వి.యఫ్ యక్స్ :- దుర్గా ప్రసాద్ కేథ, ఆనంద్ పల్లకి
పి.ఆర్.ఓ :- ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్
—
Eluru Sreenu
P.R.O