కిరణ్ అబ్బవరం థ్రిల్లర్ “క” సినిమా మ్యూజిక్ హక్కులు సొంతం చేసుకున్న ‘సారెగమ’

21

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. రీసెంట్ గా అనౌన్స్ చేసిన ఈ సినిమా టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌రూపొందిస్తున్నారు. “క” సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో లేబుల్ ‘సారెగమ’ సొంతం చేసుకుంది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్న “క” సినిమా ఆడియో మ్యూజిక్ ఫీస్ట్ లా ఉండబోతోంది.

“క” సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో “క” సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. కిరణ్ అబ్బవరం కొంత విరామం తర్వాత చేస్తున్న “క” సినిమా అనౌన్స్ మెంట్ నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది.

నటీనటులు : కిరణ్ అబ్బవరం

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – సుధీర్ మాచర్ల
సినిమాటోగ్రఫీ – విశ్వాస్ డానియేల్
మ్యూజిక్ – సామ్ సీఎస్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత – చింతా గోపాలకృష్ణ రెడ్డి
దర్శకత్వం – సుజీత్, సందీప్