HomeTeluguఘనంగా కిరోసిన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా కిరోసిన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్


బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మాతలుగా ధృవ హీరో గా నటించి దర్శకత్వం వహించిన సినిమా కిరోసిన్. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఎంతో ఆసక్తిగా తెరకెక్కిన ఈ చిత్రం యొక్క ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా కిరోసిన్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా రెండు నిమిషాల 14 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్‌ సినిమా పై ఆసక్తిని ఎంతో పెంచింది. అలాగే ప్రముఖ దర్శకుడు ఉదయ్ గుర్రాల ఓ పాటను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ మిస్టరీ కథగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17 న గ్రాండ్ గా విడుదల కాబోతుండగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నటుడు సమ్మెట గాంధీ మాట్లాడుతూ.. ఈ సినిమా లో ఒక మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు ధ్రువ గారికి ధన్యవాదాలు. ప్రేక్షకులకు చిన్న పెద్ద సినిమా అనే తేడా ఉండదు. సినిమా బాగుంటే వారు తప్పకుండా ఆదరిస్తారు. మా కిరోసిన్ సినిమా కోసం అందరూ కష్టపడి పని చేశారు. మంచి లొకేషన్స్ లో సినిమా ఎంతో అందంగా తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

నటుడు లక్ష్మణ్ మీసాల మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ధృవ గారితో నా అనుబంధం చాలా రోజుల నుంచి ఉంది. ఈ సినిమా కోసం అందరు చాలా కష్టపడ్డారు. 17 న అందరూ ఎంతో థ్రిల్ అయిపోయే సినిమా అవుతుంది. ఈ చిత్రంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరు ప్రేక్షకులు మా ఈ కిరోసిన్ సినిమా ని ఆదరించ వలసిందిగా కోరుతున్నాను అన్నారు.

నిర్మాత దీప్తి కొండవీటి మాట్లాడుతూ.. నాకు సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులందరికి థాంక్స్. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ధృవ గారు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఈ సినిమా తప్పకుండా చేయాలనీ భావించాను. దానికి తగిన అవుట్ ఫుట్ వచ్చింది. సినిమా కోసం ఆయన చాలా బాగా కష్టపడ్డాడు. సినిమా ఫిలిం ఇండస్ట్రీ కి ధృవ రూపంలో ఒక మంచి దర్శకుడు దొరికాడని చెప్పవచ్చు అన్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా ను ఇంత బాగా నిర్మించిన దీప్తి కొండవీటి గారికి, పృద్వీ యాదవ్ గారికి అల్ ది బెస్ట్. ఈ సినిమా లో హీరో గా నటించి, దర్శకత్వం వహించిన ధృవ పనితనం బాగుంది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా అందరి ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమాలో ప్రతి ఒక్కరు కూడా బాగా నటించారు. అందరికీ అల్ ది బెస్ట్ అన్నారు.

హీరో, దర్శకుడు ధృవ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. కథ మీద ఎంతో నమ్మకం, నాపై అపారమైన నమ్మకం తోనే ఈ అవకాశం ఇచ్చారు. నేను హీరో గా నటిస్తాను అన్నప్పుడు వారు చేసిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనిది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. మిస్టరీ సినిమానే అయినా అన్ని రకాల అంశాలు చిత్రంలో ఉంటాయి. జూన్ 17 న అందరు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి అన్నారు.

P.Rambabu
cinejosh.com
9848 123 007

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES