మంత్రి తలసాని చేతుల మీదుగా ప్రారంభమైన కెహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్

619


మన జీవితంలో చర్మ కేశ సౌందర్యానికి ఎంత ప్రాముఖ్యత పెరిగిందో తెలిసిందే. మనలోని ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింప చేస్తుంది కాబట్టే స్కిన్ హెయిర్ సంరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కెహా స్కిన్ హెయిర్ క్లినిక్ శ్రీనగర్ కాలనీలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా కేహా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమ ప్రముఖులు గౌరవ అతిథులుగా భారీగా హాజరయ్యారు. హీరో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, డైరెక్టర్ హను రాఘవపూడి, కిరణ్, భరత్ కమ్మ, నటి బిజెపి వైస్ ప్రెసిడెంట్ కవిత, నటులు ఉతేజ్, ఢిల్లీ రాజేశ్వరి, జెమిని సురేష్, హీరోయిన్ హీరోషిని కోమలి, తో పాటు రచయితలు భాస్కర భట్ల, లక్ష్మి భూపాల, నిర్మాతలు భగవాన్ పుల్లారావు, నాగ సుశీల, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె, రైటర్ సిద్దార్థ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరామ్, మెడికల్ డైరెక్టర్ దుర్గా కల్యాణి మాట్లాడుతూ… నేటి తరానికి అవసరమైన బ్యూటీ, డెర్మటాలజీ సేవలను అతి తక్కువ ధరలకు అందిస్తున్నాం. శ్రీనగర్ కాలనీలో విశాలమైన ప్రాంగణంలో అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందిస్తాం. మంత్రి తలసాని గారితో పాటు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన చిత్ర పరిశ్రమ ప్రముఖులందరికీ చాలా థాంక్స్. అని అన్నారు.