కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ ప్రీ రిలీజ్ వేడుక‌లో రామ్‌చ‌ర‌ణ్

442

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. స్పోర్ట్స్ రొమ్‌-కామ్ గా రూపొందిన‌ ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా టెక్నీషియన్స్ తో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాని తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందించారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. న‌గేష్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా జ‌న‌వ‌రి 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది.

ఈ సంద‌ర్భంగా బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో పార్క్ హ‌య‌త్ లో `గుడ్ లక్ సఖి` ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. ముఖ్య అతిధిగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హాజ‌ర‌య్యారు. రిప‌బ్లిక్ డేనాడు జ‌రిగిన ఈ వేడుక‌లో చిత్రంలో సంద‌ర్భానుసారంగా వ‌చ్చే `ఎగిరే తిరంగ జెండాల త‌ల ఎత్తి దించ‌కుండా..` పాట‌ను రామ్ చ‌ర‌ణ్ ఆవిష్క‌రించారు. బిగ్ టిక్కెట్‌నూ విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ, నేను అతిథిగా రాలేదు. నాన్న‌గారి దూత‌గా వ‌చ్చాను. ఆయ‌న ఆశీస్సులు తెలియ‌ప‌ర్చ‌డానికి వ‌చ్చాను. యంగ్ నిర్మాత‌లు శ్రావ్య‌, సుధీర్ ఈ స్థాయికి చేర‌డం మామూలు విష‌యం కాదు. యంగ్ టెక్నిక‌ల్ టీమ్ ప‌నిచేశారు. న‌గేష్ నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్‌. కెమెరామెన్‌, కీర్తి ఇలా ఇంత‌మంది క‌లిసి ప‌నిచేయ‌డం మామూలు విష‌యం కాదు. అం ఆది పినిశెట్టి రంగ‌స్థ‌లంలో మా అన్న‌గా చేశారు. ఎంత‌గానో ఆక‌ట్టుకునే ప‌లికించింది. ఇక మ‌హాన‌టిలో కీర్తి త‌ప‌న న‌చ్చింది. అలా నేష‌న‌ల్ అవార్డు ద‌క్కించ‌కోవ‌డం గ్రేట్‌. ఇలాంటి క‌థ‌లు మీరే చెప్పాలి. ఈనెల 28న సోలో రిలీజ్ దొర‌క‌డం మంచి విజ‌యం చేకూరుతుంద‌ని భావిస్తున్నా. కీర్తి అభిమానుల‌తోపాటు మా అభిమానులు కూడా సినిమా చూడండ‌ని పేర్కొన్నారు. అనంత‌రం మ‌హా న‌టి కీర్తి కోసం ఆర్‌.ఆర్‌.ఆర్‌.లోని నాటునాటు.. సాంగ్‌ను రామ్ చ‌ర‌న్ తో క‌లిసి డాన్స్ చేసి అల‌రించారు.

దేవీశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. ఓ ఫంక్ష‌న్‌లో నాకు వాచ్ ఇచ్చి ఇక నీటైమ్ చూసుకో అన్నారు. అలా నాకు మంచి టైమ్ వ‌చ్చింది. చిరంజీవిగారికి పాజిటివ్ రావ‌డంతో ఏం చేయాలని అనుకుంటుంటుండ‌గా, ఆయ‌నే ఫోన్ చేసి చ‌ర‌ణ్ వ‌స్తున్నాడ‌ని చెప్పారు. ఇది ఆయ‌న ప్ర‌త్యేక గుణం అభినంద‌నీయం. అలాగే ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లో ఎక్క‌డా లేనిది తెలుగులో వుంది. బిగ్గెస్ట్ స్టార్‌కు కొడుకు వున్నా, ఆయ‌నా హీరోగా న‌టించ‌డం.   కీర్తి సురేష్ చిన్న చిన్న హావ‌భావాలు బాగా ప‌లికించింది. అమాయ‌క‌త్వంతో కూడిన అమ్మాయి నుంచి ప‌రిణ‌తి చెందిన అమ్మాయిగా అద్భుతంగా న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు, కీర్తి కాంబినేష‌న్ అదిరిపోయింద‌ని తెలిపారు.

చిత్ర‌ ద‌ర్శ‌కుడు న‌గేష్ కుకునూర్‌ మాట్లాడుతూ, 25 ఏళ్ళ ముందు `హైద‌రాబాద్ బ్లూస్` సినిమా చేశాను. కానీ పూర్తి స్థాయిలో తెలుగు సినిమాకు ఇంత కాలం ప‌ట్టింది. ఈ సినిమా అంగీక‌రించ‌డానికి కీర్తి వుంద‌నే. ఆమె ఈ పాత్ర‌ను బాగా పోషించింది. ఇక జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టి.. వీరంద‌రితో ప‌నిచేయ‌డం ఆనందంగా వుంది. దేవీశ్రీ‌ప్ర‌సాద్ చ‌క్క‌టి బాణీలు కూర్చారు. క‌థ‌గా చెప్పాలంటే ప‌ల్లెటూరిలో బంజార అమ్మాయి ఎలా షూట‌ర్‌గా ఎదిగింది అనేది పాయింట్ ఈ సినిమా కె. విశ్వ‌నాథ్‌, జంథ్యాల చిత్రాల స్పూర్తిగా తీసుకున్న‌ట్లుగా వుంటుంది. టైటిల్ ప్ర‌కారం అంద‌రికీ గుడ్ ల‌క్ అంటూ పేర్కొన్నారు.

చిత్ర నిర్మాత సుధీర్ చంద్ర ప‌దిరి మాట్లాడుతూ, ఈ సినిమా ప్రారంభం నుండి పూర్తి కావ‌డం కారణాల‌న్నీ దిల్ రాజుగారికి బాగా తెలుసు. మా టీమ్ శ్రావ్య హార్డ్ వ‌ర్క్ చేశారు. స‌మిష్టి కృషితో 28న థియేట‌ర్ల‌లో రాబోతోంది అని చెప్పారు.

దిల్ రాజు మాట్లాడుతూ, ఫ‌స్ట్ ఈ సినిమాకు బ్యాడ్ ల‌క్ స‌ఖీ అని పెట్టారు. దేవీశ్రీ గారినే క‌థ అలాంటిది అన్నారు. త‌ర్వాత సుధీర్‌గారు క‌లిసి క‌థ చెప్పారు. మంచి క‌థ కాబ‌ట్టి ఎంక‌రేజ్‌తో రిలీజ్ చేయాల‌నుకున్నా. కానీ కొన్ని ఏరియాలు కూడా పంపిణీ చేసేలా ప‌రిస్థితులు వ‌చ్చాయి. కీర్తి గురించి చెప్పాలంటే ఆమె మ‌హాన‌టి. జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టి మంచి టీమ్.. బ్యాడ్ ల‌క్ స‌ఖి నుంచి గుడ్ ల‌క్ స‌ఖిగా మారిన యూనిట్‌కు విజ‌యం చేకూరాల‌ని ఆకాంక్షించారు.

కీర్తి సురేష్ మాట్లాడుతూ, మ‌హాన‌టి త‌ర్వాత సైన్ చేసిన సినిమా ఇది. ఫ‌న్ సినిమా చేయాల‌నిపించి గుడ్ ల‌క్ స‌ఖీ చేశా. ద‌ర్శ‌కుడు, నిర్మాత‌ల‌కు ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు. క‌థ బాగా న‌చ్చింది. హైదరాబాద్ బ్లూస్‌.. ఆఫ్ బీట్ ఫిలిం. ఆ త‌ర్వాత గుడ్ ల‌క్ స‌ఖితో న‌గేష్ గారు రావ‌డం ఆనందంగా ఉంది. . సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అంటూ.. మీతో డాన్స్ చేయాల‌ని నా డ్రీమ్ అని తెలిపారు. ఇక చిరంజీవిగారికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. డి.ఎస్‌.పి.తో 5వ సినిమా చేశానని తెలిపారు.

తారాగ‌ణం: కీర్తిసురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, రాహుల్ రామ‌కృష్ణ‌ తదిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: నగేష్ కుకునూర్
స‌మ‌ర్ప‌ణ‌: దిల్ రాజు (శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌)
బ్యాన‌ర్‌: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
నిర్మాత‌: సుధీర్ చంద్ర ప‌దిరి
కో ప్రొడ్యూస‌ర్‌: శ్రావ్య వర్మ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్ర‌ఫి: చిరంతాన్ దాస్
పిఆర్ఓ: వంశీ – శేఖ‌ర్‌

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385