కేసీఆర్ ఫిల్మ్స్, శ్రీ మహా విష్ణువు మూవీస్ ప్రొడక్షన్ నంబర్ వన్ సెట్లో ఘనంగా జరిగిన కేథరిన్ త్రెసా బర్త్ డే వేడుకలు !!

311

” ఇద్దరమ్మాయిలతో, సరైనొడు, వాల్తేరు వీరయ్య, వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కేథరిన్ త్రెసా. సందీప్ మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో కేథరిన్ త్రెసా హీరోయిన్ గా నటిస్తోంది. కేసీఆర్ ఫిల్మ్స్ , శ్రీ మహా విష్ణువు మూవీస్ పతాకాలపై సోమ విజయ్ ప్రకాష్ నిర్మాణంలో “ఓదెల రైల్వే స్టేషన్” ఫేమ్ అశోక్ తేజ దర్శకత్వంలో దావులూరి జగదీష్, పల్లి కేశవరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ మెడికేర్ హాస్పిటల్ లో జరుగుతోంది. కాగా సెప్టెంబర్ 10న హీరోయిన్ కేథరిన్ త్రెసా పుట్టినరోజు వేడుకను మియాపూర్ ది ఎలైట్ హోటల్ లో చిత్ర యూనిట్ ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ మాధవ్, హీరోయిన్స్ కీర్తి చావ్లా, నిష్మా, దీక్షా పంత్, దర్శకుడు అశోక్ తేజ, నిర్మాతలు దావులురి జగదీశ్, పల్లి కేశవరావు తదితరులు పాల్గొని కేథరిన్ త్రెసాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం చిత్ర దర్శకుడు అశోక్ తేజ మాట్లాడుతూ.. ” కేథరిన్ త్రెసా.. సందీప్ మాధవ్ క్రేజీ కాంబినేషన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ నాన్ స్టాప్ గా హైదారాబాద్ లో జరుగుతోంది.. మా షూటింగ్ సెట్లోనే కేథరిన్ త్రెసా బర్త్ డే వేడుకలు జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మేము అనుకున్న దానికన్నా సినిమా చాలా బాగా వస్తోంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా కోపరేట్ చేస్తూ వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా మా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఒక పవర్ ఫుల్ టైటిల్ ని ఎనౌన్స్ చేయబోతున్నాం.. ఫైనల్ గా మా లవ్లీ హీరోయిన్ కేథరిన్ త్రెసా కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. అన్నారు.

*కేథరిన్ త్రెసా-సందీప్ మాధవ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజ చెంబోలు, రవి కాలే, శ్రీనివాసరెడ్డి, మధునందన్, దొరబాబు, ఆనంద్ చక్రపాణి, మహేష్ విట్టా, నాగ మహేష్, కోటేశ్వరరావు, జగదీశ్, అధ్విక్ మహారాజ్, కీర్తి చావ్లా, బేబీ కృతి, ఘట్టమనేని సాయి రేవతి, నిష్మా, దీక్ష పంత్, పూజరెడ్డి, భానుశ్రీ, తదితరులు నటిస్తున్నారు .

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: సతీష్ ముత్యాల, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్, ఎడిటర్: జునైద్ సిద్ధిక్, పి.ఆర్.ఓ: జిల్లా సురేష్, ప్రొడక్షన్ కంట్రోలర్: రాము, సహానిర్మాతలు: గౌటి హరినాథ్, రొంగుల శివకుమార్, నిర్మాతలు: దావులూరి జగదీశ్, పల్లి కేశవరావు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అశోక్ తేజ.*