”ఈ కథలో పాత్రలు కల్పితం” ప్రీ రిలీజ్ ఈవెంట్..మార్చి 26 న విడుదల..!!

614

పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మాతగా మార్చి 26 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ పోస్టర్స్‌‌కి, సాంగ్స్‌కి, టీజర్‌కి మంచి స్పందన రాగా సినిమా పై మంచి అంచనాలు పెరిగాయి. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లిరిసిస్ట్ చంద్రబోస్, అంబర్ పేట్ శంకరన్న, బోరబండ సత్యం, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ర్యాప్ సింగర్ నోయెల్, హుషారు ఫేమ్ హీరో దినేష్ తేజ్, డాన్స్ మాస్టర్ యష్ తదితరులు ముఖ్య అతిధులుగా వచ్చారు.. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ చిత్ర విశేషాలను పంచుకున్నారు..

అంబర్ పేట్ శంకరన్న మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కృతజ్ఞతలు.. నా మిత్రుడు ఆహ్వానం మేరకు ఈ ఫంక్షన్ కి వచ్చాను..ఈ సినిమాకి, రాజేష్ నాయుడు కి నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్ చూసి పెద్ద వాళ్ళు మెచ్చుకున్నారు. పూరి జగన్నాధ్ కి ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను అన్నారు..

నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు.. నేను సినిమా నేపథ్యం కలిగిన వాడిని కాదు.. కానీ పవన్ తేజ్ కొణిదెల ఓ డైరెక్టర్ ని తీసుకొచ్చి చెప్పిన కథ ఎంతో ఆకట్టుకుంది. అభిరామ్ పై నమ్మకం అప్పుడే వచ్చింది. ఇప్పుడు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు. లాక్ డౌన్ లో కష్ట సమయంలో అందరు నన్ను సపోర్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన బోరబండ సత్యమన్న కి, అంబర్ పేట్ శంకరన్న కి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు…

దర్శకుడు అభిరామ్ మాట్లాడుతూ.. స్టేజి మీద ఉన్న ముఖ్య అతిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ సినిమా కోసం చాల కష్టపడ్డాను.. అందరు మంచి సపోర్ట్ ఇచ్చారు.. మెగా ఫ్యామిలీ లో ఓ హీరో మంచి సబ్జెక్టు కోసం చూస్తున్నారు అని విన్నాను.. వెళ్లి కథ చెప్పాను.. ఆయనకు కథ విపరీతంగా నచ్చేసింది. వెంటనే ప్రొడ్యూసర్ ని కలిస్తే సినిమా ఓకే అయ్యింది.అయన ఇప్పటికీ స్క్రిప్ట్ కూడా వినలేదు. నన్ను నమ్మిన ఆయనకు కృతజ్ఞతలు..   మార్చి 26 న సినిమా రిలీజ్ అవుతుంది.. అందరు థియేటర్లలో ఈ సినిమా ను చూడండి..అన్నారు…

హీరో పవన్ తేజ్ కొణిదెల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు.. నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీ లో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వచ్చాను.. ఇప్పుడు ఈ కథలో పాత్రలు కల్పితం ద్వారా హీరోగా వస్తున్నాను.  . మార్చి 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. అందరు ఈ సినిమా ను ఆశీర్వదించి హిట్ చేయండి అన్నారు..