ధియేటర్ నుండి నవ్వించి పంపించే బాధ్యత మాది — కథ కంచికి మనం ఇంటికి నిర్మాతలు

305

అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో క‌థ కంచికి మ‌నం ఇంటికి చిత్రాన్ని ఏప్పిల్ 8న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో యూనిట్ సభ్య‌లు పాల్గొన్నారు.

నిర్మాత మోనిష్ ప‌త్తిపాటి మాట్లాడుతూ

క‌థ కంచికి మ‌నం ఇంటికి క‌థ డైరెక్ట‌ర్ చాణిక్య చిన్న నాకు నెరేట్ చేసిన‌ప్ప‌డు చాలా కొత్త‌గా అనిపించింది. హార‌ర్ కామెడీ జాన‌ర్ లో ఇప్ప‌టికే చాలా సినిమాలు విడుద‌లైన‌ప్ప‌టికీ క‌థ కంచికి మ‌నం ఇంటికి సినిమా చాలా భిన్నంగా ఉంటూ ప్రేక్ష‌కుల్ని ఆద్యంతం అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కంతో మా చిత్ర బృందం భావిస్తున్నాము. ఈ సినిమాలో హీరో అదిత్ అరుణ్, పూజీత పొన్నాడ పేయిర్ ల‌వ్లీగా ఉండ‌నుంది. అలానే ఆర్జే హేమంత్, గెటెప్ శ్రీను మ‌ధ్య న‌డిచే కామెడీ ట్రాక్ ఈ సినిమాకే మెయిన్ హైలెట్. ఏప్రిల్ భారీ రేంజ్ లో ఈ సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాము అని నిర్మాత మోనిష్ పత్తిపాటి తెలిపారు.

ద‌ర్శ‌కుడు చాణ‌క్య చిన్న మ‌ట్లాడుతూ

క‌థ కంచికి మ‌నం ఇంటికి స్టోరీ ఆద్యంతం వినోద‌భ‌రితంగా సాగుతుంది. అదిత్ అరుణ్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ క‌థ‌ హార్రర్ జోనర్‌లోకి టర్న్ తీసుకుంటుంది. సప్తగిరి కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. మొత్తం సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు ద‌ర్శ‌కుడు చాణక్య‌. ఈ క‌థ‌ను ఎక్కడా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మాత మోనిష్ ప‌త్తిపాటి, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ ద‌త్తి సురేశ్ బాబు నిర్మించారు. కోవిడ్ క‌ష్ట కాలంలో యూనిట్ లో ఎవ‌ర‌కి ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. భీమ్స్ సంగీతం, వైయ‌స్ కృష్ణ సినిమాటోగ్ర‌ఫి ఈ సినిమాను ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అవ్వ‌బోతున్నాయి. ఏప్రిల్ 8న ఈ సినిమా విడుద‌లై ప్రేక్ష‌కుల్ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని న‌మ్ముతున్నాను.

నటీనటులు:
అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్ కుమార్, శ్యామల, హేమంత్ , గెటప్ శ్రీను తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ :- యమ్. పి.ఆర్ట్స్
టైటిల్ :- కథ కంచికి మనం ఇంటికి
నిర్మాత :- మోనిష్ పత్తిపాటి
దర్శకత్వం :- చాణిక్య చిన్న
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :- సుభాష్ డేవాబత్తిన
క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ – ద‌త్తి సురేశ్ బాబు
లైన్ ప్రొడ్యూసర్ :- కుమార్ కోట
మ్యూజిక్ :- బీమ్స్ సిసిరోలియో
డి.ఓ.పి :- వైయస్ కృష్ణ
ఎడిటింగ్ :- ప్రవీణ్ పూడి
డైలాగ్స్ :- శ్రీనివాస్ తేజ
ఫైట్స్ :- షావోలిన్ మల్లేష్
వి.యఫ్ యక్స్ :- దుర్గా ప్రసాద్ కేథ, ఆనంద్ పల్లకి
పి.ఆర్.ఓ :- ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్