‘రాజా విక్రమార్క’ టీజర్ రెస్పాన్స్ అదిరింది..

480

కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘రాజా విక్రమార్క’. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ శనివారం సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

హీరో కార్తికేయ మాట్లాడుతూ “వరుణ్ తేజ్ గారు మా ‘రాజా విక్రమార్క’ టీజర్ విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవిగారి టైటిల్ తో సినిమా చేశాం. నాకు మెగాస్టార్ అంటే ఎంత ఇష్టమనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన టైటిల్ పెట్టుకునే అదృష్టం ఈ సినిమా ద్వారా నాకు దొరకడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా టీజర్ మెగా హీరో వరుణ్ తేజ్ విడుదల చేయడం… ఇప్పటివరకు ప్రశాంత్ ఆర్. విహారి ప్రేమకథలు చేశాడు. ఫస్ట్ టైమ్ జానర్ షిఫ్ట్ చేశాడు. అతడు ఇచ్చిన మ్యూజిక్ అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తుంది. టెక్నికల్ గానూ సినిమా హైస్టాండర్డ్స్ లో ఉంటుంది. ఆల్రెడీ టీజర్ రెస్పాన్స్ బావుంది. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నాను. నేను బ్యాచిలర్‌గా చేసిన లాస్ట్ సినిమా ఇది. మంచి హిట్ కొట్టి జీవితంలో నెక్స్ట్ స్టెప్ వేస్తే చాలా బావుంటుంది. తప్పకుండా హిట్ కొడతామని నాకు తెలుసు” అని అన్నారు.

డైలాగ్ కింగ్ సాయి కుమార్ మాట్లాడుతూ “టీజర్ విడుదల చేసిన వరుణ్ తేజ్ కి థాంక్స్. ఆల్రెడీ టీజర్ రెస్పాన్స్ అదిరింది. దర్శకుడు, మా శ్రీ సరిపల్లి వచ్చి ఈ సినిమా గురించి చెప్పినప్పుడు కార్తికేయ హీరో అనగానే హ్యాపీగా ఫీలయ్యా. ‘ అన్ని సినిమాలు బావుండాలి. అందులో మా ‘రాజా విక్రమార్క’ ఉండాలి” అని అన్నారు.

సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ “వృత్తిపరంగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగానూ శ్రీ సరిపల్లి నాకు ఎప్పటినుండో ఫ్రెండ్. ఈ సినిమాలో నేను స్పెషల్ క్యారెక్టర్ చేశా. అందుకు శ్రీ, కార్తికేయ కారణం. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శ్రీ చదువుకున్నాడు. అప్పటినుండి పరిచయం. అక్కడ హాలీవుడ్ స్టయిల్ నేర్చుకున్నాడు. క్వాలిటీ విషయంలో ’88’ రామారెడ్డిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. 100 పర్సెంట్ సక్సెస్ కొడుతున్నాం. ‘రాజా విక్రమార్క’ మెగాస్టార్ చిరంజీవిగారి టైటిల్. మాకు ఆయన ఆశీర్వాదం కూడా ఆటోమేటిక్ గా వచ్చేసింది” అని అన్నారు.

నిర్మాత ’88’ రామారెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కార్తికేయ. ఈ సినిమాకు ఆయన మూలస్థంభం. అందరి ఆశీర్వాదం సినిమాకు ఉంటుందని ఆశిస్తున్నా” అని అన్నారు.

దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ “నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత ’88’ రామారెడ్డిగారికి, హీరో కార్తికేయకు… నాతో పని చేసిన మా టీమ్ అందరికీ థాంక్స్. మా ఆర్ట్ డైరెక్టర్, కెమెరామేన్, ఎడిటర్, నేను… మేమంతా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాం. మాకు కార్తికేయ అవకాశం ఇచ్చాడు. ఆయన పెట్టుకున్న అంచనాలను చేరుకుంటానని ఆశిస్తున్నాను. టీజర్ ప్రేక్షకులకు నచ్చిందని అనుకుంటున్నాను. సినిమా కూడా నచ్చాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు ఆదిరెడ్డి, సినిమాటోగ్రాఫర్ పీసీ మౌళి, ఎడిటర్ జస్విన్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.

కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్ జంటగా… సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: పులగం చిన్నారాయణ, ఛాయాగ్రహణం: పి.సి.మౌళి, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, ఎడిటింగ్: జస్విన్ ప్రభు, ఆర్ట్: నరేష్ తిమ్మిరి, శ్రీ రూప్ మీనన్, ఫైట్స్: సుబ్బు,నబా, పాటలు: రామజోగయ్య శాస్త్రి, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: నిఖిల్ కోడూరు, సౌండ్ ఎఫెక్ట్స్: సింక్ సినిమా, సమర్పణ : ఆదిరెడ్డి. టి , నిర్మాత: 88 రామారెడ్డి, దర్శకత్వం: శ్రీ సరిపల్లి.