ఆగస్ట్ 13న విడుదల కానున్న యంగ్ హీరో నిఖిల్, చందూ మొండేటి ‘కార్తికేయ 2’

177

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంట‌గా న‌టిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న కార్తికేయ 2 చిత్రం ఆగస్ట్ 13 న విడుదల కానుంది. ఇందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు కార్తికేయ -2 చిత్ర బృందం. సినిమాటో గ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ గారు, దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్, యంగ్ హీరోస్ సిద్ధూ జొన్నలగడ్డ, అడవి శేష్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు.

సింగీతం శ్రీనివాస్ రావు గారు మాట్లాడుతూ..
కార్తికేయ ప్రొడ్యూసర్ వివేక్ గారు మీరు రావాలి ఫంక్షన్ కి అని పిలిచినప్పుడు, నాకెవరు తెలియదు ఎలా రావాలి అనుకున్నాను, కానీ సినిమా తీసిన స్పిరిట్ నన్ను ఇక్కడికి నడిపించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీ కి క్లిష్ట పరిస్థితికి వచ్చినప్పుడు, సినిమానే దానిని ఓవర్ కేం చేస్తుంది. ఎటువంటి పరిస్థితులకి సినిమా ఇండస్ట్రీ లొంగలేదు అని చెప్పుకొచ్చారు.

రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..
కొన్ని సినిమాలుఆడవు అని తెలిసిన మొహమాటనికి కొన్ని సార్లు ఫంక్షన్స్ కి రావాల్సి ఉంటుంది. కానీ ఈ సినిమా మానస వాచన కర్మణా ఈ సినిమా చాలా బాగుంది. తెలుగులో ఎంత వసూలు చేస్తుందో హిందీలో కూడా అలానే చేస్తుంది అని కార్తికేయ బృందానికి అభినందనలు తెలిపారు.

మంత్రి తలసాని మాట్లాడుతూ..
ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన వారికీ అభినందనలు తెలుపుతూ.. కార్తికేయ చిత్రంను ఆదరించాలని పిలుపునిచ్చారు. మూడు పువ్వులు ఆరుకాయలుగా సినీ పరిశ్రమ ముందుకు వెళ్లాలని కోరారు. కార్తికేయ 1 నేను చూసాను, అలానే కార్తికేయ -2 మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.

దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ..
ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది. గివింగ్ టూ ది నేచర్ అని ఒకటి ఉంటుందండి. మనం విగ్రహాలకు పాలాభిషేకాలు అవి చేస్తుంటాం , చాలామంది వాటిని విమర్శిస్తారు. మన పురాణాల్లో, మన ఇతిహాసాల్లో ఏవైతే ఉన్నాయో దాని వెనుక ఒక ప్రోపర్ ఫాక్ట్ ఉంటుంది. అవి తెలుసుకోకుండా కొన్ని విషయాల్లో కామెంట్ చెయ్యకూడదు. ఇలాంటివే మన సినిమాలో బోలెడు ఉన్నాయి. అని చెప్తూ ముగించారు.

అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ..
ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన వారికీ కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ విజువల్స్ ఇంత బాగా రావడానికి కారణం కార్తీక్ ఘట్టమనేని, కాలా భైరవ మంచి ఆర్ ఆర్ ఇచ్చారు. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది.

హీరో నిఖిల్ మాట్లాడుతూ…
ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన వారికీ కృతజ్ఞతలు తెలుపుతూ..
మంచి కంటెంట్ తో సినిమాలు చేస్తే ఆడియన్స్ థియేటర్ కి వస్తారు అని బింబిసార, సీతా రామం సినిమాలు నిరూపించాయి. అలానే మా సినిమాకి కూడా బుకింగ్స్ బాగా ఉన్నాయని మా ప్రొడ్యూసర్స్ చెబుతున్నారు. అలానే ఈ సినిమాకి మా ప్రొడ్యూసర్స్ బాగా సపోర్ట్ చేసారు. అనుమప నాకన్నా అన్నింటిలో ముందు ఉంటుంది. మైనస్ డిగ్రీ చలిలో కూడా నటించింది. మా సినిమా ఆర్ ఆర్ కి ముందు బాగుంది అనిపించింది. ఆర్ ఆర్ తరువాత ఇది మా సినిమాయేనా అని ఫీల్ వచ్చింది అంత అద్భుతంగా ఉంది. అలానే ఇస్కాన్ ఆర్గనైజేషన్ కి కూడా చాలా థాంక్స్ అండి. మా సినిమా టీం ను ఇన్వైట్ చేసి మధుర బృందావన్ టెంపుల్ లో మా టీజర్ ను రిలీజ్ చేసే అవకాశం కల్పించారు. ఈ సినిమా ఆగష్టు 13న రిలీజ్ కాబోతుంది ఖచ్చితంగా చూడండి.

నటీనటులు:
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు

టెక్నికల్ టీం:

క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్యం – చందు మెుండేటి
బ్యాన‌ర్: పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి& అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌
కొ-ప్రొడ్యూస‌ర్: వివేక్ కూచిభొట్లనిర్మాత‌లు: టి.జి విశ్వ ప్ర‌సాద్‌&అభిషేక్ అగ‌ర్వాల్‌
మ్యూజిక్: కాలభైరవ
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Eluru Sreenu,Shyam
P.R.O