ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగిన కపాలా మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్

184


ఎస్ కే ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సౌమ్య శెట్టి నిర్మాత గా, వినయ్ ఎదునందన్ డైరెక్షన్ లో ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ సీఈఓ రాజీవ్ సహకారం తో ఆమెజాన్ ఓవరసిస్, హంగామా,ఎమ్ ఎక్స్ ప్లేయర్,టాటా స్కై, సోనీ,ఎల్ జి తదితర వాటిల్లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.

ఈ సందర్బంగా మూవీ టీం సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు హీరో ప్రజ్వల్, హీరోయిన్ సుష్మ గౌడ, లీడ్ క్యారెక్టర్ యమున, ప్రొడ్యూసర్ సౌమ్య శెట్టి, డైరెక్టర్ వినయ్ ఎదునందన్, ఈస్ట్ వెస్ట్ సీఈఓ రాజీవ్, ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రొడ్యూసర్ సౌమ్య శెట్టి మాట్లాడుతూ ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయటానికి డైరెక్టర్ వినయ్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది, మూవీ కంప్లీట్ అయ్యాక రిలీజ్ చేయటానికి చాలా ఇబ్బందులు పేస్ చేశాను ఆ టైం లో ఈస్ట్ వెస్ట్ సీఈఓ రాజీవ్ గారు మాకు బ్యాక్ బోన్ గా నిలబడి ఈ సినిమా రిలీజ్ కి కీలక పాత్ర పోషించారు అలాగే మమ్మల్ని ప్రోత్సాహం ఇవ్వటానికి ఇక్కడి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

డైరెక్టర్ వినయ్ ఎదునందన్ మాట్లాడుతూ ఇప్పుడు మనం అందరం పోటీ పడవలిసింది తెలుగు తో కన్నడ తో నో కాదు పాన్ వరల్డ్ తో మన ఇండియన్ సినిమా స్థాయి మారి పోయింది, కపాలా మూవీ గురించి నేను ఇద్దరికీ రుణ పడి వుంటాను ఒకటి మా ప్రొడ్యూసర్ సౌమ్య గారు రెండు ఈస్ట్ వెస్ట్ సీఈఓ రాజీవ్ గారు అలాగే మా సినిమా ని ఓ టి టి లో చూసి తప్పకుండా ఆదరిస్తారు అని నమ్మకం నాకు వుంది.

ఈస్ట్ వెస్ట్ సీఈఓ రాజీవ్ మాట్లాడుతూ ప్రొడ్యూసర్ సౌమ్య అలాగే డైరెక్టర్ వినయ్, హీరో ప్రజ్వల్, యమున, సుష్మ టీం అందరికి నా బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నాను, కపాలా మూవీ ఇది హారర్ జోనర్ మూవీ నేను హారర్ సినిమాలు చూస్తున్నప్పుడు భయపడను ఒక్క చంద్ర ముఖి సినిమా నన్ను బాగా ఇంప్రెస్స్ చేసింది తరువాత ఆ స్థాయి లో ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ అనుభూతి ఫీల్ అయ్యాను, మా ఈస్ట్ వెస్ట్ ఇంటర్టైనర్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నందుకు కు చాలా ఆనందం గా వుంది.

ప్రొడ్యూసర్ ప్రశాంత్ గౌడ్ ఈ సినిమా ఓ టి టి లో మంచి సక్సెస్ కావాలి అలాగే ఈ మూవీ లో నటించిన నటినటులకి సాంకేతిక నిపుణులు కి మంచి పేరు రావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

హీరో ప్రజ్వల్, హీరోయిన్ సుష్మ, నటి యమున అందరు మా సినిమా ని ఆదరిస్తారు అని తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా ని ఆదరిస్తారు అని విశ్వాసం వ్యక్తపరిచారు.
నటి నటులు :
హీరో :ప్రజ్వల్
లీడ్ యాక్టర్ :యమున
హీరోయిన్ :సుష్మ గౌడ

బ్యానర్ :ఎస్ కే ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్
ప్రొడ్యూసర్ :సౌమ్య శెట్టి
డైరెక్టర్ :వినయ్ ఎదునందన్