మార్చి 17న పాన్ ఇండియా కాదు.. గ్లోబ‌ల్‌ ‘కబ్జ’ చేస్తున్నాం : క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర‌

205

ఇండియ‌న్ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘క‌బ్జ’. పాన్ ఇండియా రేంజ్‌లో క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ‌ భాష‌ల్లో ఈ చిత్రం మార్చి 17న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఆర్‌.చంద్రు ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌కుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెలుగులో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను శ‌నివారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉపేంద్ర‌, శ్రియా శ‌ర‌న్, డైరెక్ట‌ర్ ఆర్‌.చంద్రు స‌హా టీమ్ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు. …

క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘కబ్జ’ సినిమా రిలీజ్ తర్వాత నా టీమ్ గురించి నేను మాట్లాడుతాను. ఇప్పుడు చంద్రు గురించి మాత్ర‌మే మాట్లాడుతాను. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన త‌ర్వాత క‌రోనా కూడా వ‌చ్చింది. అయితే చంద్రు వెన‌క్కి త‌గ్గ‌లేదు. మూడేళ్లు క‌ష్ట‌ప‌డి భ‌గీర‌థుడిలా క‌బ్జ సినిమాను ఇక్క‌డి వ‌ర‌కు తీసుకొచ్చాడు. ఓ టీమ్‌గా అంద‌రినీ క‌లుపుకుంటూ ఓ ప‌ట్టుద‌ల‌తో ఇక్క‌డి వ‌ర‌కు చంద్రు వ‌చ్చాడు. శ్రియా శ‌ర‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రి స్టార్స్‌తో యాక్ట్ చేశారు. ఇప్పుడు నాతో యాక్ట్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే జానీ మాస్ట‌ర్‌. నేను తెలుగు ఇండ‌స్ట్రీని చూసి నేర్చుకుని, రాసుకుని సినిమాలు చేశాను. మీ అంద‌రి స‌పోర్ట్‌కి థాంక్స్‌. మార్చి 17న ఇండియానే కాదు.. గ్లోబ‌ల్‌ను క‌బ్జ చేయ‌బోతున్నాం’’ అన్నారు.

డైరెక్ట‌ర్ ఆర్‌.చంద్రు మాట్లాడుతూ ‘‘తెలుగులో చాలా రోజులుగా సినిమా చేయాలని ఎదురు చూస్తున్న త‌రుణంలో ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌గారితో కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ సినిమా చేశాను. నా కెరీర్‌లో ఇది తొలి పాన్ ఇండియా మూవీ. ఉపేంద్ర‌గారితో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ డ్రీమ్ పూర్తి కావ‌టానికి ఆయ‌నే కార‌ణం. ఇంత పెద్ద సినిమా చేస్తాన‌ని నేను కూడా అనుకోలేదు. సినిమా అంతా గ్లోబ‌లైజ్ అయ్యింది. ఆడియెన్స్ అప్‌డేట్ అయ్యారు. మ‌నం కూడా అప్‌డేట్ కావాల‌ని భావించి మంచి టీమ్‌ను ఏర్పాటు చేసుకుని చేసిన సినిమా ఇది. క‌న్న‌డ బాద్‌షా కిచ్చా సుదీప్‌గారు క‌బ్జ మూవీలో డైమండ్ త‌ర‌హా పాత్ర‌లో న‌టించారు. ఉప్పి సార్‌పై ఉన్న ఇష్టంతో ఈ సినిమాలో ఆయ‌న న‌టించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌వి బ‌స్రూర్‌గారు గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు. క‌బ్జ సినిమా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఉపేంద్ర‌గారు పెద్ద సూప‌ర్‌స్టార్ అయిన‌ప్ప‌టికీ డేట్స్ అడ్జ‌స్ట్ చేసి మ‌రీ యాక్ట్ చేశారు. మార్చి 17న పునీత్ రాజ్‌కుమార్‌గారి జ‌యంతి రోజున క‌బ్జ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. తెలుగులో సుధాక‌ర్‌రెడ్డిగారు, ల‌క్ష్మీకాంత్‌, హ‌నుమంత రెడ్డిగారు రిలీజ్ చేస్తున్నారు. హిందీలో ఆనంద్ పండిట్‌గారు రిలీజ్ చేస్తున్నారు. ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి ఫిలింస్ వాళ్లు మ‌ల‌యాళంలో రిలీజ్ చేస్తున్నారు. అలాగే లైకా వాళ్లు త‌మిళంలో రిలీజ్ చేస్తారు. 20 దేశాల‌కు క‌బ్జ సినిమా హ‌క్కుల‌ను అమ్మేశాం. నిజాయ‌తీగా హాలీవుడ్ టింట్‌లో సినిమా చేయాల‌ని క‌బ్జ సినిమాను టీమ్ వ‌ర్క్‌గా చేశాం’’ అన్నారు.

నిర్మాత సాయినాథ్ మాట్లాడుతూ ‘‘‘కబ్జ’ ట్రైల‌ర్‌లో చూసింది కొంత మాత్ర‌మే. రేపు థియేట‌ర్స్‌లో అంద‌రి అంచ‌నాల‌ను మించి ఉంటుంది. చంద్రు డేర్ డెవిల్ ఏ ప‌ని అయినా చేస్తాడు. రిస్క్ అయిన‌ప్ప‌టికీ అస్స‌లు త‌గ్గ‌కుండా సినిమా చేశాడు. నేను సినిమా చూశాను. ఉపేంద్ర‌గారు అద్భుతంగా న‌టించారు. కిచ్చా సుదీప్ బిగ్గెస్ట్ స‌ర్‌పైజ్ అవుతారు. ఇక ఉపేంద్ర‌, శ్రియ మ‌ధ్య ఉన్న సెంటిమెంట్ సీన్స్ ఆక‌ట్టుకుంటాయి. మార్చి 17న వ‌స్తున్న క‌బ్జ బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది’’ అన్నారు.

నిర్మాత హ‌నుమంత రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలుగులో సుధాకర్ రెడ్డిగారితో కలిసి కబ్జ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. బుద్ధిమంతుడు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాం. దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ కబ్జ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. తప్ప‌కుండా సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతుంది’’ అన్నారు.

అలంకార్ మాట్లాడుతూ ‘‘కబ్జ సినిమా నిర్మాణంలో భాగం కావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. క‌బ్జ టీజ‌ర్ చూడ‌గానే షాక‌య్యాను. విజువ‌ల్స్ అంత అద్భుంగా ఉన్నాయి. వెంట‌నే చంద్రుకి ఫోన్ చేసి నువ్వేనా డైరెక్ట్ చేసిందని అడిగాను. మార్చి 17న రిలీజ్ అవుతున్న సినిమా మాట్లాడుతుంది’’ అన్నారు.

శ్రియా శరన్ మాట్లాడుతూ ‘‘ కబ్జ సినిమాలో నన్ను భాగం చేసిన చంద్రుగారికి థాంక్స్. సినిమా క‌థ విన‌గానే న‌చ్చేసింది. ఇందులో త‌ల్లి పాత్ర‌లో న‌టించాను. మా అమ్మాయి రాధ గురించి ఎప్పుడూ చంద్రు, ఆయ‌న భార్య అడుగుతుండేవారు. పాప‌కి గిఫ్ట్స్ ఇచ్చేవారు. చంద్రుగారు చాలా హార్డ్ వ‌ర్క‌ర్‌. ఆయ‌న క‌ష్టాన్ని ఈరోజు తెర‌పై చూస్తున్నాం. ఉపేంద్ర‌గారు చాలా డౌన్ టు ఎర్త్ ప‌ర్స‌న్‌. ఆయ‌నతో ప‌ని చేయటం అదృష్టంగా భావిస్తున్నాం’’ అన్నారు.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘‘నేను చిన్నప్పటి నుంచి ఉపేంద్ర‌గారికి అభిమానిని. ఆయ‌న సినిమాకు టైటిల్ పెట్ట‌కుండా చేయి సింబ‌ల్ పెట్టి రిలీజ్ చేశారు. అది చూసి నేను షాక‌య్యాను. ఆయ‌న ఐడియాల‌జీని నేను ల‌వ్ చేస్తాను. నేను డైరెక్ట్ చేసిన సినిమాకు ఉపేంద్రగారినే కొంంత స్ఫూర్తిగా తీసుకున్నాను. క‌బ్జ సినిమా పెద్ద హిట్ కావాలి. సుధాక‌ర్‌గారికి, నితిన్‌గారికి బాగా డ‌బ్బులు రావాల‌ని కోరుకుంటున్నాను. ర‌వి బ‌స్రూర్ మ్యూజిక్ బావుంది. చంద్రుగారికి ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.

డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ ‘‘ఉపేంద్ర‌గారు ‘కబ్జ’మూవీలో అద్భుతంగా నటించారు. చంద్రు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాతలకు సినిమా మంచి లాభాలను తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

వరదరాజు మాట్లాడుతూ ‘‘కబ్జ సినిమా వర్క్ కంప్లీట్ అవుతూ వస్తుంది. సినిమా చాలా బావుంటుంది. అందరికీ నచ్చుతుంది. కె ఫర్ కన్నడ.. కె.జియఫ్, కాంతార.. ఇప్పుడు కబ్జ. హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ కాన్ఫిడెంట్గా చెబుతున్నాను’’ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో రైట‌ర చంద్ర బోస్‌, ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఆస్కార్ ముంగిట నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మించిన నిర్మాత డి.వి.వి.దాన‌య్య‌.. నాటు నాటు పాట రాసిన లిరిక్ రైట‌ర్ చంద్ర‌బోస్‌ను ఉపేంద్ర అండ్ టీమ్ సత్క‌రించారు.