HomeTeluguకమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం భారీ రిలీజ్ కు సన్నాహాలు

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం భారీ రిలీజ్ కు సన్నాహాలు

రాంగోపాల్ వర్మ ఆధ్వర్యంలో తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం ట్రైలర్, సాంగ్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. తెలుగు రాష్టాల్లో ఈ సినిమాపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో చూపించబోతున్న కంటెంట్ ఎలా వుండబోతుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇటీవల విడుదల చేయగా…విశేషమైన ఆదరణ లభించింది. పప్పు లాంటి అబ్బాయి పాట వైరల్ గా నిలిచింది. సూపర్బ్ రెస్పాన్స్ తో మంచి ట్రెండింగ్ లో హల్చల్ చేసింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ చిత్రంలో అనేక ఎలిమెంట్స్ ని డైరెక్టర్ టచ్ చేశాడు. ప్రతీ పాత్రకు ప్రాధాన్యమండేలా తీర్చిదిద్దారు. కమర్షియల్ సాగే ఎంటర్టైనర్ చిత్రమిది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రాన్ని త్వరలోనే అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

Tuk Tuk’ Movie Review

ALL CATEGORIES