HomeTeluguనవంబర్ 15 నుంచి శిల్పకళావేదికలో తెలంగాణ కళ జాతర..... - కళావాహిని ఆర్ట్...

నవంబర్ 15 నుంచి శిల్పకళావేదికలో తెలంగాణ కళ జాతర….. – కళావాహిని ఆర్ట్ థియేటర్స్


తెలంగాణ సంస్కృతులను సాంప్రదాయాలను బ్రతికించు కునేందుకు కళావాహిని ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో తెలంగాణ కళ జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుల రమేష్ రాజా తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ పాత్రికేయులు మహమద్ షరీఫ్ ముఖ్య అతిథిగా, గౌరవ అధ్యక్షులుగా జి. రవితేజ జ్యూరీ సభ్యులు విజయనిర్మల రాజేంద్ర రాజు లతో కలిసి పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా షరీఫ్ మహమ్మద్ మాట్లాడుతూ. నవంబర్ 15 నుండి 17 వరకు మూడు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని శిల్ప కళా వేదికలో కొనసాగిస్తామని పేర్కొన్నారు.మరుగున పడిన తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న కళాకారులను ప్రోత్సహించేందుకు 30 సంవత్సరాల క్రితం కళావాహిని సంస్థను స్థాపించారని ఈ సందర్భంగా బంగారు తెలంగాణ, తెలంగాణ నాడు నేడు రేపు అంశాలపై షార్ట్ ఫిలిం డాక్యుమెంటరీ ఫిలిం చిత్రలేఖనం కవితల పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. కళాకారుల ప్రతిభను గుర్తించి విజేతలకు బహుమతుల తోపాటు ప్రశంసాపత్రాలను అందజేస్తామని అన్నారు. షార్ట్ ఫిల్మ్ లో ఉత్తమ చిత్రానికి one lakh rupees ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళా వాహిని విశిష్ట పురస్కారాలు, ఏకశిలా కీర్తి శ్రీ పురస్కారాలు మరియు స్పూర్తి శ్రీ పురస్కారాలు అందజేస్తున్నటు చెప్పారు. కార్యక్రమంపై ఆసక్తి కలవారు కళావాహిని వెబ్ సైట్ www.kalavaahini.in ను సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ బోజడ్ల, లగ్గాని శ్రీనివాస్, ప్రొఫెసర్ షరిఫుద్దిన్ గారు, కృపాదానంగారు, జానపద కళాకారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES