`6 టీన్స్, జానకి వెడ్స్ శ్రీరామ్, నేను సీతామాలక్ష్మి, శంకర్‌దాదా MBBS, నవ వసంతం`వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రోహిత్. ప్రస్తుతం ఆయన హీరోగా శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ `కళాకార్`. ఏజీ అండ్ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్న ఈ చిత్రంలో షాయాజీ షిండే, పృథ్విరాజ్, రాజీవ్ కనకాల, శివశంకర్, రవికాలే, గగన్, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్ వంటి ప్రముఖ నటులు కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ – “ఫస్ట్ కళాకార్ టైటిల్ బాగుంది. అలాగే పోలీస్ ఇన్స్‌పెక్టర్‌గా రోహిత్ లుక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైమ్ రోహిత్‌ను పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో చూస్తున్నాను. చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారు. వెంకటరెడ్డిగారు నిర్మాతగా శ్రీను బందెల డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా డెఫినెట్‌గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. రోహిత్ నేను కలిసి ఎప్పటినుండో ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తున్నాము. ఆయన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ టు రోహిత్ అండ్ టీమ్“ అన్నారు.
హీరో రోహిత్ మాట్లాడుతూ – “కళాకార్ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ హీరో శ్రీకాంత్ గారు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనతో ఎప్పటినుంచో నాకు మంచి అనుభందం ఉంది. నేను ఫస్ట్ టైమ్ యాక్షన్ అండ్ సస్పెన్స్ సబ్జెక్ట్‌తో చేస్తోన్న చిత్రమిది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది“ అన్నారు.
చిత్ర నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం మాట్లాడుతూ – ”మా ‘కళాకార్`ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదలచేసిన హీరో శ్రీకాంత్‌గారికి ధన్యవాదాలు. హీరో రోహిత్‌కు పర్‌ఫెక్ట్ రీ ఏంట్రీ సబ్జెక్ట్ ఇది. మంచి కథ-కథనం, భారీ తారాగణంతో శ్రీను ఈ మూవీని తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ముగింపు దశలో ఉన్నాయి. త్వరలో విడుదలతేదిని ప్రకటిస్తాం“అన్నారు.
దర్శకుడు శ్రీను బందెల మాట్లాడుతూ – “ఈ మూవీతో రోహిత్ ఒక డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తారు. మా నిర్మాత వెంకటరెడ్డిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించారు. సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది“అన్నారు.
తారాగణం: రోహిత్, షాయాజీ షిండే, పృథ్విరాజ్, రాజీవ్‌కనకాల, శివశంకర్, రవికాలే, గగన్‌విహారి, నలినీ కాంత్, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్, రమేష్‌వర్మ, బస్టాఫ్ కోటేశ్వరావు, ఘర్షణ శ్రీనివాస్, అరుణ, నాగిరెడ్డి, మనోజ్‌కుమార్, జయవాణి, సూర్య, చక్రి, ఐశ్వర్య (చైల్డ్ ఆర్టిస్ట్)
సాంకేతిక వర్గం:
సినిమాటోగ్రఫి: అమర్ జి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: చిన్నా, సంగీతం: కనిష్క, ఫైట్స్: డ్రాగన్ ప్రకాశ్ & దేవరాజ, సింగర్స్: బాబా సెహగల్, జావిద్ అలీ, ఉమా నేహ, రాహుల్ సిప్లిగంజ్, లిరిక్స్: జేబి లక్ష్మణ గంగ, డీఐ: అన్నపూర్ణ స్టూడియో, డాల్బీ అట్మాస్ 7.1: రామానాయుడు స్టూడియోస్, డబ్బింగ్, ఎడిటింగ్: ప్రసాద్ ల్యాబ్, VFX : శివకుమార్, SFX: రాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివారెడ్డి జాజాపురం, నిర్మాత: వెంకటరెడ్డి జాజాపురం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీను బందెల.