సంగీత ప్రపంచంలో తన పాటల తో మై మరిపించే పాటల మాంత్రికుడు జూన్ 18న హైటెక్స్ ఎక్సబిషన్ గ్రౌండ్ లో సంగీత ప్రత్యక్ష ప్రదర్శన జరుగనుంది.
ప్రదర్శనలో భాగంగా భారతీయ& పాశ్చత్య క్లాసికల్, వరల్డ్ రిథమ్స్, రాక్, ఎలక్ట్రానిక్ తదితర సంగీతాలను ఇక్కడ ఆస్వాదించవచ్చు. వీటితోపాటు బాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమా పాటలు అలరించనున్నారు.
నగరవాసులను సరికొత్త సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారు. అంతేకాకుండా సిద్ శ్రీరామ్ అత్యంత ప్రజాదరణ పొందిన అల్ టైం రికార్డు పొందిన సాంగ్స్ ని ఈ లైవ్ కాన్సర్ట్ మీ జీవితంలో ఒక మంచి సంగీతానుభవాన్ని తొలిసారిగా అనుభవంలోకి తీసుకొస్తుందనడంలో సందేహం లేదు.
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ప్రసాద్ లాబ్ లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి, ఈవెంట్ టిక్కెట్ విక్రయాలను ప్రారంభించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగర్ సిద్ద శ్రీరామ్ తనకు అత్యంత ఇష్టమైన మ్యుజీయన్లని అన్నారు. వారి కార్యక్రమం కోసం తాను ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నానని అన్నారు.
నిర్వహకులు అఖిలేష్, ఆశ్రిత్ మరియు అర్జున్ మాట్లాడుతూ సంగీత ఆస్వాదించడానికి నగరవాసులు జూన్ 18వ తేదిన సిద్దంగా ఉండండి. తొలిసారిగా నగరంలో అతిపెద్ద సంగీత కార్యక్రమాన్ని ఫాట్ ఏంజెల్, చోర్డ్వర్స్ మరియు అర్జున్ ఎంటరైన్మెంట్ ఆధ్వర్యంలో సింగర్ సిద్ శ్రీరామ్ జూన్ 18న హైటెక్స్ ఎక్సబిషన్ గ్రౌండ్ లో లైవ్ కాన్సర్ట్‌ని మీ ముందుకు తీసుకువస్తున్నారు
ప్రదర్శన టిక్కెట్లు www.insider.inలో అందుబాటులో ఉన్నాయి